ChatGPT: చాట్ జీపీటీని టార్గెట్ చేసిన హ్యాకర్స్.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు?

ప్రస్తుత రోజుల్లో కోట్లాదిమంది యూజర్లు ఏఐ టూల్స్ ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చాట్‌జీపీటీ ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయి

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 04:50 PM IST

ప్రస్తుత రోజుల్లో కోట్లాదిమంది యూజర్లు ఏఐ టూల్స్ ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చాట్‌జీపీటీ ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో హ్యాకర్ల కన్ను కాస్త చాట్‌జీపీటీ పై పడింది. ఈ టూల్‌లో స్టోర్ అయ్యే యూజర్ల డేటాను హ్యాకర్లు తస్కరించి డార్క్ వెబ్‌లో అమ్మేస్తున్నారు. ఈ డేటాను హానికరమైన పనులు చేయడానికి, లేదంటే యూజర్ల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడానికి కొనుగోలుదారులు వాడుతున్నారు. కాగా తాజాగా సైబర్ రిపోర్ట్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, చాట్‌జీపీటీ అకౌంట్స్‌ను దొంగిలించి, వాటిని డార్క్ వెబ్‌లో వేలం వేసి సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చట్టవిరుద్ధమైన దాడులు సైబర్ క్రైమ్, ఐడెంటిటీ థెఫ్ట్ ఘటనలలో పెరుగుదలకు దోహదపడుతున్నాయి.

అయితే మరి చాట్‌జీపీటీ యూజర్లు తమ డేటాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? తమ డిజిటల్ ఐడెంటిటీని ఎలా రక్షించుకోవాలి? అన్న విషయానికి వస్తే.. కాగా చాట్‌జీపీటీ యూజర్లు ఏదైనా అనధికార యాక్టివిటీని గుర్తించడానికి బ్యాంక్, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఒకవేళ యూజర్‌కి తెలియకుండా ఏదైనా అనధికార యాక్టివిటీ జరిగిందని గుర్తిస్తే వెంటనే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వీక్ పాస్‌వర్డ్స్‌ సెట్ చేసుకున్న అకౌంట్స్ హ్యాకింగ్‌కి గురయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే లెటర్స్, నంబర్స్‌, సింబల్స్ ఉన్న స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను మాత్రమే ఉపయోగించాలి. సైబర్‌ఫ్రాడ్స్‌ బారిన పడకుండా పాస్‌వర్డ్‌ను తరచుగా మార్చుకోవడం ఇంకా మంచిది.

ప్రముఖ కంపెనీలు ఆఫర్ చేసే ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ సర్వీసులకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. ఈ కంపెనీలు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పర్యవేక్షిస్తాయి. డార్క్ వెబ్‌లో వారి పర్సనల్ డీటైల్స్ అమ్ముడుపోయిన విషయాన్ని తెలియజేస్తాయి. అకౌంట్స్‌కు ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ లేయర్‌ను జోడించడానికి వీలైన చోటల్లా టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి. ఏఐ టూల్స్ వాడకంపై ప్రతి యూజర్ అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి వారి చాట్ హిస్టరీ ఆఫ్ చేసుకోవాలి. అలాగే యూజర్లు చాట్‌జీపీటీలో కన్వర్జేషన్లను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. దీంతో హ్యాకర్ మీ డేటాను దొంగిలించలేరు.