Site icon HashtagU Telugu

New Phones : కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్

Upcomingphones

Upcomingphones

కొత్త ఫోన్ (New Phone) కొనుగోలు చేయాలనీ అనుకుంటున్నా వారికీ గుడ్ న్యూస్. వచ్చే నెలలో అద్భుతమైన ఫీచర్లతో..అతి తక్కువ ధరల్లో స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రముఖ సంస్థలు సిద్ధం అయ్యాయి. ప్రీమియం నుంచి మిడ్-రేంజ్ సెగ్మెంట్ల వరకు పలు కంపెనీలు తమ కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్, నథింగ్, వివో, ఇన్ఫినిక్స్ లాంటి బ్రాండ్లు టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకునేలా సిద్ధమవుతున్నాయి. అవి ఏంటో చూస్తే..

Miss World 2025 : మిల్లా ఆరోపణలపై విచారణ చేపట్టాలి – కేటీఆర్ డిమాండ్

వన్‌ప్లస్ 13s ఫోన్ 6.32 అంగుళాల OLED డిస్‌ప్లే, డ్యూయల్ 50MP కెమెరాలతో వచ్చే అవకాశముంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 6,260mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ధర సుమారుగా రూ. 49,990గా ఉండవచ్చని ఊహిస్తున్నారు. అదే విధంగా, నథింగ్ ఫోన్ 3 లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 100W ఛార్జింగ్, 5,000mAh బ్యాటరీ వంటి హైఎండ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ.44,999 ఉండవచ్చని సమాచారం.

ఇక వివో నుంచి వచ్చే T4 అల్ట్రా ఫోన్‌లో 50MP పెరిస్కోప్ లెన్స్, 10X మాక్రో లెన్స్, 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ GT30 మోడల్‌ను సిద్ధం చేస్తోంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర సుమారుగా రూ.25,000గా ఉండవచ్చని అంచనా. ఇలా ఈ జూన్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఉండే అవకాశముంది.