Site icon HashtagU Telugu

Phone Tips : అలాంటి ప్లేసుల్లో మీ ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త ఫోన్ హ్యాక్ అవడం ఖాయం?

Are You Charging Your Phone In Such Places.. But Be Careful, The Phone Is Sure To Get Hacked..

Are You Charging Your Phone In Such Places.. But Be Careful, The Phone Is Sure To Get Hacked..

Phone Charging Tips : మామూలుగా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లలో చార్జింగ్ అయిపోవడం అన్నది కామన్. అటువంటి సమయంలో మనతోపాటు చార్జర్ ని తీసుకెళ్లి బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఇలా పబ్లిక్ పేసుల్లో ఎక్కడపడితే అక్కడ చార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. జర్నీ చేసే టైమ్‌లో అంటే రైలులో లేదా ఏసీ బస్సులో లేదా విమానాశ్రయాలు ఇతర ప్రదేశాల్లో తమ ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్‌ (Phone)ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఫోన్ చార్జింగ్ పెట్టడానికి జాగ్రత్తలు ఏమిటి అని అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే అలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

We’re Now on WhatsApp. Click to Join.

అమాయక ప్రజలకు ట్రాప్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను టార్గెట్ చేస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, ఇతర పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్‌లో తమ ఫోన్లు (Phone) ఛార్జ్ చేయడం వల్ల హ్యాకర్లు ఫోన్లకు హ్యాక్ చేయడం చాలా సులభమట. ఛార్జింగ్ పోర్ట్‌ లోకి ఫ్లగ్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుందట. మన ఫోన్‌లో హానికరమైన మాల్వేర్ వైరస్‌ను పంపి అందులో నుంచి మీ వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఈజీగా దొంగిలిస్తారు. ఇలా మీరు జ్యూస్ జాకింగ్ స్కామ్ బారిన పడవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎక్కువగా రైలులో లేదా ఇతర పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ లలో ఉండే ఛార్జింగ్ కేబుల్‌తో కూడా మీ డేటా ట్రాన్స్‌ఫర్ ఈజీగా చేయచ్చు.

ఫోన్‌లో మాల్‌వేర్ వైరస్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు దీన్ని ఉపయోగిస్తారు. మీరు ఈ కేబుల్‌ను కనెక్ట్ చేసి ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఛార్జ్ చేయడం ప్రారంభించినప్పుడల్లా, స్క్రీన్‌పై పాప్-అప్ కనిపిస్తుంది. మీరు ఈ కేబుల్‌ని వాడాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్‌ను చాలా మంది స్కిప్ చేస్తున్నారు. దీంతో మాల్వేర్ వైరస్ నెమ్మదిగా మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లోకి ప్రవేశిస్తుంది. మరి ఈ మోసం నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంటి నుంచి బయలుదేరే ముందు మీ ఫోన్ లేదా మీ డివైజ్‌ను ఫుల్‌గా ఛార్జ్ చేయాలి. ఒకవేళ మీకు సమయం తక్కువగా ఉంటే, మీ గమ్యాన్ని చేరుకునేంత వరకైనా ఛార్జ్ చేయాలి. పబ్లిక్ ప్లేసులలో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఏదైనా వార్నింగ్ నోటిఫికేషన్ వస్తే, వెంటనే ఛార్జింగ్ తీసేయాలి. అలాగే మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు మీతో సొంత కేబుల్స్‌తో ఛార్జ్ చేయాలి. దీన్నుంచి డేటా ట్రాన్స్‌ఫర్ ఏం అవ్వదు. డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తుందో లేదో సూచించడానికి LED లైట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇలా మీరు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. లేదంటే మీతో పాటు పవర్ బ్యాంకులను తీసుకెళ్లడం వల్ల ఎక్కడ చార్జింగ్ పెట్టుకునే అవసరం ఉండదు.

Also Read:  Ghee For Health: చలికాలంలో రోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది తెలుసా?