WhatsApp: వాట్సప్‌కు ఈ నెంబర్ల ద్వారా కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే బీ అలర్ట్

మన ఫోన్‌కు రోజూ స్పామ్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఈ స్పామ్ కాల్స్ వల్ల చిరాకు అనిపిస్తూ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 09:33 PM IST

WhatsApp: మన ఫోన్‌కు రోజూ స్పామ్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఈ స్పామ్ కాల్స్ వల్ల చిరాకు అనిపిస్తూ ఉంటుంది. స్పామ్ కాల్స్ రాకుండా చేసుకునేందుకు ఫోన్ లోని అనే ఆప్షన్లను ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఇక ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా స్పామ్ కాల్స్ ను ముందే గుర్తించి కట్టడి చేయగలుగుతన్నాం. అలాగే స్పామ్ కాల్స్ వల్ల నష్టపోకుండా జాగ్రత్త పడుతున్నాం.

అయితే ఫోన్‌కే కాకుండా వాట్సప్‌కు కూడా ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి స్పామ్ కాల్స్ వస్తోన్నాయి. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. మోసపూరిత కాల్స్ ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కొంతమంది కేటుగాళ్లు వాట్సప్ లో స్పామ్ కాల్స్, మెసేజ్ లతో మోసగించే ప్రయత్నం చేస్తోన్నారు. గత వారం, పది రోజులుగా ఇలాంటి కాల్స్ ఎక్కువయ్యాయి

లాటరీలు, లోన్‌లు, ఉద్యోగాల పేరుతో ఇంటర్నేషన్ నెంబర్ల ద్వారా వాట్సప్ కు కాల్స్ చేయడం, మెసేజ్ లు పెడటం చేస్తున్నారు. మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథిమోపియా లాంటి దేశాలకు చెందిన ఐఎస్‌డీ కోడ్ లతో సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. వాట్సప్ కాకుండా సాధారణ విధానంలో విదేశాల్లో ఉన్నవారికి కాల్ చేయాలంటే అదనపు ఛార్జీలు పడతాయి. కానీ వాట్సప్ ద్వారా ఏ దేశంలోనే ఉన్నవారితోనైనా ఉచితంగా మాట్లాడవచ్చు.

ఈ క్రమంలో వాట్సప్ ను సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇండియాలోనే ఉంటూనే అంతర్జాతీయ నెంబర్స్ ను ఉపయోగించుకుని మోసం చేస్తున్నారు. దీంతో వాట్సప్ లో తెలియని నెంబర్లు నుంచి కాల్స్ లేదా మెసేజ్ లు వచ్చినా పట్టించుకోవద్దని, వాటికి రిప్లై ఇవ్వొద్దని టెక్ నిపుణులు చెబుతున్నారు.