Site icon HashtagU Telugu

IQ Vs Embryos : సూపర్ హ్యూమన్స్ రెడీ.. మానవ పిండాలకు ఐక్యూ టెస్ట్

Iq Vs Embryos Super Humans Us Startup

IQ Vs Embryos : మెడికల్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల మెడికల్ టెస్టులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.  అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ హెలియోస్పెక్ట్ జెనోమిక్స్ సరికొత్త టెస్టులు చేయడం ప్రారంభించింది. అవేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గర్భిణుల గర్భంలోని మానవ పిండాల ఐక్యూ (మేధస్సు)ను హెలియోస్పెక్ట్ జెనోమిక్స్ కంపెనీ టెస్ట్ చేస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన ల్యాబ్‌లో ఐవీఎఫ్ వైద్యం చేయించుకున్న దాదాపు 12 మందికిపైగా గర్భిణుల గర్భంలోని మానవ  పిండాల ఐక్యూ లెవల్స్‌ను టెస్ట్ చేశారు. అయితే ఆయా టెస్టుల్లో ఏమేం రిపోర్టులు(IQ Vs Embryos) వచ్చాయనేది తెలియరాలేదు.

Also Read :Baba Siddique : షూటర్ల ఫోనులో మరో ప్రముఖుడి ఫొటో.. డేంజరస్ హిట్ లిస్టు!

హెలియోస్పెక్ట్ జెనోమిక్స్ కంపెనీ అమెరికాలోని కొన్ని డయాగ్నస్టిక్ సంస్థలతో జట్టు కట్టినట్లు సమాచారం. 100 మానవ పిండాల ఐక్యూను టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చేందుకు సగటున రూ.42 లక్షల దాకా ప్యాకేజీని హెలియోస్పెక్ట్ జెనోమిక్స్ కంపెనీ  వసూలు చేస్తోందని అంటున్నారు.  అంటే ఒక మానవ పిండం ఐక్యూను టెస్ట్ చేయడానికి అమెరికా కరెన్సీలో దాదాపు రూ.40వేల దాకా తీసుకుంటున్నారు. మానవ పిండాలకు ఈ టెస్టును చేయడంతో పాటు వాటి ఐక్యూ లెవల్‌ను పెంచేందుకు కూడా తాము టిప్స్ ఇస్తామని సదరు కంపెనీ చెబుతోంది. తాము చెప్పే నైతిక పద్ధతులను కస్టమర్లు పాటిస్తే.. పుట్టబోయే పిల్లల ఐక్యూ లెవల్స్ సాధారణం కంటే దాదాపు 6 పాయింట్లు ఎక్కువగా ఉంటాయని అంటోంది. అంటే.. సూపర్ హ్యూమన్స్ పుడతారన్న మాట. అయితే ఈ టెక్నాలజీపై కొందరు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఐక్యూ లెవల్స్ తక్కువగా ఉండే గర్బస్థ  పిండాల ఉనికికి దీనివల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.  ఐక్యూ లెవల్స్ తక్కువగా ఉన్నాయని కొందరు పేరెంట్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. సహజ సిద్ధంగా మానవ పిండాన్ని వదిలేయడమే బెటర్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.