Site icon HashtagU Telugu

Iphone: ఐఫోన్ 14 కస్టమర్లకు బాడ్ న్యూస్.. ఏంటంటే?

Iphone

Iphone

యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ 14 కస్టమర్ లకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే ఐఫోన్ 14 మోడల్స్ అయిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేసిన వినియోగదారులు మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది హెచ్చరికలను జారీ చేసింది ఐఫోన్ సంస్థ. కరోనా మహమ్మారి కారణంగా వినియోగదారులకు ఐఫోన్ 14 అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా డెలివరీ చేయనున్నట్లు ఐఫోన్ సంస్థ వెల్లడించింది. ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి మళ్ళీ అంతకంతకు విజృంభిస్తుండడంతో ఆంక్షల కారణంగా ఆలస్యం అవుతుంది అని తెలిపింది.

చైనా లోని జెంగ్‌జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేయడం వల్ల చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్‌ చెయిన్‌ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఫలితంగా షిప్‌మెంట్స్‌ లేట్‌ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది ఆపిల్ సంస్థ. ముఖ్యంగా ఐఫోన్‌ 14 ప్రొ, ఐఫోన్‌ 14ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ లకు ఎక్కువ డిమాండ్‌ ఉందని తెలిపింది.

చైనాలో కోవిడ్‌ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్‌ఫోర్స్ గత వారం జెంగ్‌జౌ ప్లాంట్‌లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్‌మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం.