iPhone 15: తమిళనాడులో యాపిల్ తయారీ సంస్థ

యాపిల్ తమ ప్రొడక్ట్స్ డ్రాగన్ కంట్రీ చైనాలో తయారు చేస్తుంది. ఎంతోకాలం చైనా యాపిల్ తయారీకి ఆతిధ్యమిస్తుంది. కానీ యాపిల్ సంస్థ తమ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావించింది

iPhone 15: యాపిల్ (Apple) తమ ప్రొడక్ట్స్ డ్రాగన్ కంట్రీ చైనాలో తయారు చేస్తుంది. ఎంతోకాలం చైనా యాపిల్ తయారీకి ఆతిధ్యమిస్తుంది. కానీ యాపిల్ సంస్థ తమ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావించింది. అందులో భాగంగానే యాపిల్ తయారీదారు ఫాక్స్‌కాన్ భారతదేశాన్ని ఎంచుకుంది. యాపిల్ తయారీదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. తమిళనాడు సమీపంలోని శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది.భారతదేశం నుండి ఇతర దేశాలకు దాని ఎగుమతులను పెంచడానికి ఫాక్స్‌కాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

గత సంవత్సరం సెప్టెంబర్ లో యాపిల్ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో సిరీస్ 14ని అసెంబ్లింగ్ మొదలుపెట్టింది. చైనాలో జరిగిన వారం రోజుల్లోనే భారత్‌లో అసెంబ్లింగ్ ప్రారంభమైంది. కాగా ఇప్పుడు ఈ సంస్థ భారతదేశం మరియు చైనా నుండి ఒకేసారి ఐఫోన్ 15 ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

యాపిల్ తయారీ ఉత్పత్తిని భారత్ లో ప్రారంభించడం పరిశ్రమ వర్గాలు మరోలా కూడా భావిస్తున్నాయి. చైనాతో ఎప్పటికైనా ప్రమాదమే అని ఆ సంస్థ భావిస్తోందట. అందుకే భారత్ అయితే ఎలాంటి సమస్య ఉండదని భావించి భారత్ లో తమ ఉత్పత్తులని ప్రారంభించేందుకు మొగ్గు చూపినట్టు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: Human Flesh : మనిషి శరీరంలోని మాంసాన్ని తినేస్తున్నా కొత్త జీవి