Site icon HashtagU Telugu

Foldable iPhone: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి రాబోతున్న ఫోల్డబుల్ ఐఫోన్?

Mixcollage 25 Jul 2024 11 03 Am 8493

Mixcollage 25 Jul 2024 11 03 Am 8493

మార్కెట్లో ఐఫోన్లకు ఉండే క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే కంపెనీలలో ఐఫోన్ కూడా ఒకటి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ ఐఫోన్ ని ఒక్కసారి అయినా కూడా వినియోగించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధరలు కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఐఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటించడంతో పాటు అతి తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండే గా స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే ఇప్పటివరకు మామూలు స్మార్ట్ ఫోన్ లో విడుదల చేసిన ఐఫోన్ సంస్థ ఇప్పుడు ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలో ప్రపంచంలో ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయవచ్చని కంపెనీ అంచనాల ద్వారా తెలుస్తోంది. చాలా కాలంగా ఫోల్డబుల్ ఐఫోన్ తీసుకురావాలని వినియోగదారుల నుండి డిమాండ్ కూడా ఉంది ఫోల్డబుల్ ఫోన్ పని ఆలోచన దశను దాటి ముందుకు సాగిందట. అలాగే ఫోల్డబుల్ ఫోన్‌లలో ఉపయోగించే భాగాల కోసం కంపెనీ ఆసియాలోని సరఫరాదారులను కూడా సంప్రదించింది. ఇది కాకుండా, కంపెనీ ఈ ఉత్పత్తి కోసం V68 అనే ఇంటర్నల్‌ కోడ్‌ను కూడా సృష్టించింది.

ఆపిల్ ఎప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌ని విడుదల చేసినా శాంసంగ్‌ ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లతో దానికి ప్రత్యక్ష పోటీ ఉంటుంది. వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి 2019లో ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఫోన్‌ను విడుదల చేసిన మొదటి సంస్థ శాంసంగ్‌. అప్పటి నుండి ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌ల ట్రెండ్ వేగంగా పెరగడం ప్రారంభమైంది. అయితే జూలై ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2024లో Samsung Galaxy Z Fold, Z Flip AI ఫీచర్లతో పరిచయం చేసింది. Samsung దీన్ని తేలికగా సన్నగా ఉండేలా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో చైనా మొబైల్ కంపెనీలు హానర్ , హువాయ్ కూడా ఈ విభాగంలో ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. గ్లోబల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొదట్లో 49% వృద్ధి చెందింది. ఆరు నెలల్లో దాని అత్యధిక వృద్ధి రేటు, హువావే శామ్‌సంగ్‌ ను అధిగమించి మొదటి సారి అగ్రస్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదికలు వెల్లడించాయి.

Exit mobile version