Site icon HashtagU Telugu

iPhone 15: ఐఫోన్ 15 పై దిమ్మతిరిగే ఆఫర్స్.. ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా?

Mixcollage 17 Jan 2024 05 35 Pm 1898

Mixcollage 17 Jan 2024 05 35 Pm 1898

రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లలో ఐఫోన్ 15ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ స్టోర్ లలో రిపబ్లిక్ డే సేల్ నడుస్తున్నాయి. ఇందులో బాగానే స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ వస్తువులపై భారీగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజా ఆఫర్లలో ఐఫోన్ 15ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యాపిల్ ఐఫోన్ 15 గత ఏడాది రూ. 79,900కి లాంచ్ అయింది. ఈ డివైజ్‌ ఏకంగా రూ.10,901 డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. 128GB వేరియంట్‌ ఐఫోన్ 15ను ఫ్లిప్‌కార్ట్ రూ.66,999కి లిస్ట్ చేసింది.

ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందిస్తోంది. ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10% డిస్కౌంట్ పొందవచ్చు. మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్న ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే, రూ.26,010 వరకు అదనపు ట్రేడ్ ఇన్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు కలిపి రికార్డు స్థాయి తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 15పై ఇ-కామర్స్ కంపెనీలు మంచి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. ట్రేడ్ ఇన్ ఆఫర్‌లో ఐఫోన్ 13ను రూ. 26,010కి ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎడిషన్‌పై కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ. 54,990 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ అందిస్తున్నాయి.

కాగా వాల్యుయేషన్ ఆధారంగా చూస్తే.. ఐఫోన్ 15 కోసం ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను ట్రేడింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇవి ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. అయితే తాజా రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 13ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లలో ట్రేడ్ ఇన్ చేయడం మంచిది. తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్ 15కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. 1179×2556 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఇది మంచి అవుట్‌పుట్ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్ వరకు ఉంటుంది.

సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ దీని సొంతం. ఐఫోన్ 15లో ఆక్టా కోర్ బయోనిక్ A16 చిప్‌సెట్‌ ఉంటుంది. ఇది ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఐఫోన్ 15 మొత్తం 3 స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 128జీబీ /256జీబీ / 512జీబీ వేరియంట్లలో, బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో డివైజ్‌ను కొనుగోలు చేయవచ్చు. 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ ఉన్న డ్యుయల్ కెమెరా సెటప్‌ దీని సొతం. ముందు భాగంలో 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ iOS 17తో రన్ అవుతుంది. IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లను అందిస్తుంది.

Exit mobile version