Site icon HashtagU Telugu

Apple iPhone 15 Discount : యాపిల్ ఐఫోన్ 15 పై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి?

Mixcollage 27 Dec 2023 06 17 Pm 5108

Mixcollage 27 Dec 2023 06 17 Pm 5108

మీరు కూడా కొత్త యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15 భారీ డిస్కౌంట్తో అది తక్కువ ధరకే ఐఫోన్ 15 ని వినియోగదారులకు అందిస్తోంది. రూ.74,900 భారీ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. వాస్తవానికి భారత మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ ధర రూ.79,900కు ప్రకటించింది. అంటే వినియోగదారులు ఎలాంటి షరతులు లేకుండా రూ. 5 వేలు తగ్గింపును పొందవచ్చు. కానీ, మీరు దీన్ని రూ.72వేల లోపే కొనుగోలు చేయవచ్చు. అదెలా అంటే.. ఐఫోన్ 15 మునుపటి మోడల్ కన్నా పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందింది. అనేక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డిస్కౌంట్ రేట్లలో కూడా విక్రయిస్తోంది.

ఐఫోన్ 15 ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌ లలో ఫ్లాట్ డిస్కౌంట్ లను పొందడం చాలా కష్టమని చెప్పవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా పొందవచ్చు. భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ 15ని రూ.72వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కాగా ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 రూ.74,900 ప్రారంభ ధరతో అందిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను భారత మార్కెట్లో రూ.79,900కు లాంచ్ కాగా వినియోగదారులు ఎలాంటి షరతులు లేకుండా రూ. 5వేల తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 15 అన్ని కలర్ మోడల్‌లలో లేటెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే మీరు రూ. 3,745 అదనపు తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు.

అలాగే ఈ బ్యాంక్ ఆఫర్ అమెజాన్ మొబైల్ వెర్షన్‌లో పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందే వారు అమెజాన్ ద్వారా ఐఫోన్ 15ని రూ. 71,155కి కొనుగోలు చేయవచ్చు. అలాగే మీ వద్ద ఈ కార్డ్ లేకపోతే అమెజాన్ పే యాప్ ద్వారా ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేటెస్ట్ ఐఫోన్‌పై ఈ తగ్గింపును పొందవచ్చు. ఈ ఐఫోన్ 15 చాలా మెరుగైన కెమెరాను కలిగి ఉంది. ఫొటోగ్రఫీ కూడా చాలా ఆకర్షణీయంగా అందిస్తుంది. మీరు ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో కనిపించే కొత్త డిజైన్‌ను కూడా పొందవచ్చు. ఐఫోన్ 14తో పోల్చితే కొత్త ఐఫోన్ మరింత శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 20డబ్ల్యూ స్లో ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. అయితే, ఐఫోన్ యూజర్లు వేగవంతమైన ఛార్జింగ్ అందించవచ్చు. బ్యాటరీ ఆప్టిమైజ్ అయితే ప్లస్ లేదా మాక్స్ మోడల్‌లో ఉన్నంత పెద్ద బ్యాటరీని పొందలేరు. ఐఫోన్ ప్రియులకు, అభిమానులకు ఐఫోన్ 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.