Apple iPhone 14 Plus: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ పై భారీ డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే?

మార్కెట్లో ఐఫోన్లకు ఉండే క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఐఫోన్ ని ఒక్కసారైన వినియోగించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 07:05 PM IST

మార్కెట్లో ఐఫోన్లకు ఉండే క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఐఫోన్ ని ఒక్కసారైన వినియోగించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధరలు కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఐఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటించడంతో పాటు అతి తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండే గా స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అలాగే ఐఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలతో తక్కువ ధరకే అందిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ పై కూడా ఇప్పుడు భారీగా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఆఫర్స్ విషయానికి వస్తే…యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు.

యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ భారతదేశంలో రూ. 89,900 ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ లాంచ్ చేసిన తర్వాత, కంపెనీ ఫోన్ ధరను 10,000 రూపాయలు తగ్గించింది. Apple iPhone 14 Plus ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,901 తగ్గింపుతో రూ. 66,999 కి సొంతం చేసుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్,క్రెడిట్ EMI లావాదేవీల ద్వారా కస్టమర్లు ఈ ఫోన్‌పై రూ.1,500 తగ్గింపును పొందవచ్చు. దీంతో యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.65,499 అవుతుంది. ఇది కాకుండా, వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.34,500 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లు,బ్యాంక్ డిస్కౌంట్‌ల తర్వాత, వినియోగదారులు యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ ని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 30,999కి కొనుగోలు చేయవచ్చు.

అలాగే అదనంగా కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా రూ.34,500 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు,బ్యాంక్ డిస్కౌంట్ల తర్వాత, కస్టమర్లు యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ ని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 30,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే వినియోగదారులు ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ని బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్ మరియు రెడ్ వంటి కలర్స్ ల్ప్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెరుగైన A15 బయోనిక్ ప్రాసెసర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రాసెసర్ ఆపిల్ ఐఫోన్ 13 ప్రో మోడల్స్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే, ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇది 12ఎంపీ ప్రైమరీ కెమెరా,అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. యాపిల్ ప్రకారం, ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల పాటు ఉపయోగించవచ్చు.