Site icon HashtagU Telugu

iPhone 14 Plus: ఐఫోన్ 14 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే?

Iphone 14 Plus

Iphone 14 Plus

సాధారణంగా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయి అంటే చాలు ఆయా కంపెనీలు వారి వస్తువులపై ఎన్నో రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటారు. వినియోగదారుల కోసం భారీ ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఎన్నో రకాల కంపెనీలు ఎలక్ట్రానిక్ వస్తువులపై, మొబైల్ ఫోన్స్ పై భారీ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అటువంటి ఒక అదిరిపోయే డీల్‌ పై యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్లస్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను భారతదేశంలోని ఇమాజిన్ స్టోర్‌లలో దాదాపుగా రూ.9,000 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. కాగా ఐఫోన్ 14 ప్లస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు విషయానికి వస్తే..

ఐఫోన్‌ 14 ప్లస్‌ 128జీబీ , 256జీబీ మోడల్‌లు వరుసగా రూ.89,900, రూ.99,900 ధరలతో లభిస్తున్నాయి. ఇక వినియోగదారులు ఐఫోన్ 14 128జీబీ మోడల్‌ను రూ.3,000 స్టోర్ డిస్కౌంట్, HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ.5,000 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ను అందుకోవచ్చు. ఈ ఆఫర్‌ల వినియోగంతో ఫోన్‌ ధర రూ.81,900కి చేరుతుంది.
అనగా 138 జీబీ ఆఫర్ లు అన్ని కలిపి రూ. 8 వేలు వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అదే విధంగా 256జీబీ వేరియంట్ రూ.4,000 ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్, రూ.5,000 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ.90,900కి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం రిటైలర్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్ ల విషయానికి వస్తే..

ఐఫోన్ 14 ప్లస్ ఐదు కలర్స్‌లో స్లీక్‌ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం డిజైన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్, iOS 16తో రన్‌ అవుతుంది. అంతేకాకుండా డివైజ్‌ థర్మల్ పెర్ఫార్మెన్స్‌ కోసం అప్‌టేడెట్‌ ఇంటర్నల్ డిజైన్‌తో వస్తుంది. సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌లు, 1200 nits పీక్‌ HDR బ్రైట్నెస్‌, డాల్బీ విజన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ ద్వారా కామన్‌ స్పిల్స్, నీటి యాక్సిడెంట్స్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ పొందుతాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 12ఎంపీ ప్రైమరీ లెన్స్ ఉంది, ఇందులో పెద్ద సెన్సార్, పెద్ద పిక్సెల్‌లు ఉన్నాయి. తక్కువ-లైట్‌లో కూడా f/1.9 అపర్చర్‌, కొత్త 12ఎంపీ ఫ్రంట్ ట్రూడెప్త్‌ కెమెరా ద్వారా బెస్ట్‌ ఇమేజెస్‌ను అందిస్తుంది.