Site icon HashtagU Telugu

Apple iPhone 14 Launch:యాపిల్ మెగా లాంచ్ ఈవెంట్ “ఫార్ అవుట్” నేడే.. లైవ్ టెలికాస్ట్ పై పూర్తి వివరాలివీ!

Apple Iphone 14 Imresizer

Apple Iphone 14 Imresizer

యాపిల్ కంపెనీ ఈరోజు ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, ఎయిర్ పోడ్స్ ప్రో 2 వంటి ప్రొడక్ట్స్‌ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ “ఫార్ అవుట్” పేరుతో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 10.30 గంటలకు ఈ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ ప్రారంభం అవుతుంది. యాపిల్ కంపెనీ అధికారిక వెబ్ సైట్, యూట్యూబ్ చానల్ లో ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మెగా లాంచ్ ఈవెంట్ లో విడుదల చేయనున్న ప్రొడక్ట్స్, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

యాపిల్ వాచ్ సిరీస్ 8

టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి ఏటా ఐఫోన్‌లతో పాటు వాచ్‌ను కూడా లాంచ్ చేస్తుంది. వాచ్‌ 7 సిరీస్‌ డిజైన్‌తో పోలిస్తే వాచ్ సిరీస్ 8 కొత్త డిజైన్‌తో వస్తున్నట్లు సమాచారం. ఇందులో 2 అంగుళాల డయాగ్నల్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఎస్‌8 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. టెంపరేచర్‌ సెన్సర్, ఫ్రెర్టిలిటీ ట్రాకింగ్, కారు క్రాష్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉన్నట్లు సమాచారం.

ఐఫోన్ 14 సిరీస్ నాలుగు వెరియంట్లలో..

* ఈ రోజు లాంచ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్ నాలుగు వెరియంట్లలో లభ్యం కానుంది.
* ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.
* ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ హై ఎండ్ రేంజ్‌కు సంబంధించినవి. ఈ రెండు వేరియంట్లు పంచ్ హోల్ వంటి కొత్త డిజైన్‌తో వస్తున్నాయి.
* ఐఫోన్ 14 సిరీస్‌లో కొత్తగా పర్పుల్‌ షేడ్‌తో న్యూ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేస్తున్నారు.
* మోడల్స్‌‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌లకు బదులు టైటానియమ్‌ ఫ్రేమ్‌లతో డిజైన్‌ చేశారు.
* ప్రో మోడల్స్‌లో వెనుకవైపు 8K రికార్డింగ్‌ ఫీచర్‌తో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ కెమెరాలను ఇస్తున్నారు.
* ముందుభాగంలో 12 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా ఉంటుంది.
* ఇతర వేరియంట్లలో 8K రికార్డింగ్‌ క్వాలిటీ‌తో కెమెరా సెటప్ ఉండనున్నట్లు సమాచారం.

A16 బయోనిక్ చిప్‌..

* ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్14 ప్రో మ్యాక్స్ వేరియంట్లలో కొత్త A16 బయోనిక్ చిప్‌ని వినియోగించారు. * శాటిలైట్ కనెక్టివిటీ కోసం స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌65 5జీ మోడెమ్‌ను వినియోగించినట్లు సమాచారం.
* ఐఫోన్‌ 14, 14 ప్రో మోడల్స్‌ 6.1 అంగుళాలు, ఐఫోన్‌ 14 మాక్స్‌, 14 ప్రో మాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానున్నాయి.
* ఫేస్‌ ఐడీ ఫీచర్‌ను ఐఫోన్‌ 14 సిరీస్‌లోని అన్ని వేరియంట్లలో వినియోగించినట్లు సమచారం.

* ఐఫోన్ 14 ప్రోలో 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫోన్ 14లో 3,279 ఎంఏహెచ్‌, ఐఫోన్‌ 14 ప్రో మాక్స్‌లో 4,323 ఎంఏహెచ్‌, ఐఫోన్ 14 మాక్స్‌లో 4,325 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగించినట్లు సమాచారం.

ధరలు ఇలా..

ఐఫోన్‌ 14 సిరీస్‌ ప్రారంభ ధర 799 డాలర్లు, భారత కరెన్సీలో సుమారు ₹ 63,500. ఇక ప్రో మోడల్స్‌ ప్రారంభ ధర 1,099 డాలర్లు కాగా, భారత కరెన్సీలో సుమారు ₹87,400 ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.