Apple iPhone 14: అతి తక్కువ ధరకే యాపిల్ ఫోన్.. ఏకంగా రూ.25 వేలు డిస్కౌంట్?

యాపిల్ సంస్థ ఇటీవలె మార్కెట్ లోకి విడుదల చేసిన లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14. అయితే చాలా మంది ఈ ఫోన్ ని కొనుగోలు

Published By: HashtagU Telugu Desk
Apple Iphone 14

Apple Iphone 14

యాపిల్ సంస్థ ఇటీవలె మార్కెట్ లోకి విడుదల చేసిన లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14. అయితే చాలా మంది ఈ ఫోన్ ని కొనుగోలు చూస్తున్నారు. కానీ దాని ధర కారణంగా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే అటువంటి వారికీ ఒక శుభవార్త. ఎందుకంటె ఐఫోన్ 14 మీరు కోరుకున్న ధర కంటే చౌకగానే కోనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 5 నాటికి ఈ కామర్స్ యాప్ ఫ్లిప్‌కార్టులో ఉన్న ఆఫర్ ప్రకారం యాపిల్ ఐఫోన్ 14 కొనుగోలు ధరపై తగ్గింపు ఉంది. ఇండియన్ మార్కెట్‌లో ఐఫోన్ 14 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 అయినప్పటికీ, ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ ఇంకా తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది.

అయితే ప్రస్తుతం ఈ యాపిల్ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.72,499కే అందుబాటులో ఉంది. అంతే కాకుండా కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై ఐదు శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ. 4 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు రూ.23 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందింస్తున్నారు. మీరు ఈ అన్ని ఆఫర్‌లను ఉపయోగించినట్లయితే ఐఫోన్ 14ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఇకపోతే ఐఫోన్ 14 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ లో6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ ని యాక్షన్ మోడ్ అంటారు. అలా మొత్తానికి ఐఫోన్ 14 పై అన్ని ఆఫర్లు కలిపి దాదాపుగా 25 వేల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే రూ.79 ఫోన్ రూ. 25 వేల ఆఫర్ తో రూ. 54 వేలకే సొంతం చేసుకోవచ్చు.

  Last Updated: 06 Feb 2023, 07:41 AM IST