Apple Iphone 14: వాలెంటైన్స్ డే సేల్.. రూ.1849 కే ఐఫోన్ 14.. ఏకంగా రూ.56,150 డిస్కౌంట్?

ఇటీవల కాలంలో యాపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ లేటెస్ట్ ఐఫోన్లు లాంచ్ అయిన తర్వాత, పాత సిరీస్ ధరలు కూడా పడిపోయాయి.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 04:00 PM IST

ఇటీవల కాలంలో యాపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ లేటెస్ట్ ఐఫోన్లు లాంచ్ అయిన తర్వాత, పాత సిరీస్ ధరలు కూడా పడిపోయాయి. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14ను కనీ వినీ ఎరుగని డిస్కౌంట్‌తో అందిస్తోంది. పాత స్టాక్ అయిపోవడం కోసం వాటిపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది ఐఫోన్. తాజా ఆఫర్లలో ఈ డివైజ్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. యాపిల్ ఐఫోన్ 14 అత్యధికంగా అమ్ముడవుతున్న ఐఫోన్ మోడల్‌గా సత్తా చాటింది.

అయితే ఈ వాలెంటైన్స్ డేకి ఈ డివైజ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకునే వారు, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ 2022 సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14 ప్రో, ప్లస్ మోడళ్లు కూడా వచ్చాయి. ఐఫోన్ 14 అప్పట్లో రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్ ధర రూ.10,000 తగ్గింది. ఇప్పుడు ఈ డివైజ్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 56150 డిస్కౌంట్‌తో, కేవలం రూ. 1849కి పొందవచ్చు. ఇకపోతే డిస్కౌంట్ల వివరాల విషయానికి వస్తే.. యాపిల్ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,901 డిస్కౌంట్‌తో, ప్రస్తుతం రూ. 57,999కి లిస్ట్ అయింది.

కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల EMI ట్రాన్సాక్షన్లపై రూ. 1250 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర ధర రూ. 56,749కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఐఫోన్ 14పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్న ఏదైనా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ ఇన్ చేస్తే, రూ. 54,900 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతో కలిపి ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 14ను కేవలం రూ. 1,849కి కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ఫీచర్లు ఇవే.. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వచ్చే ఐఫోన్ 14, స్టైలిష్ డిజైన్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. A15 బయోనిక్ చిప్‌ ఫోన్‌లో ఉంటుంది. దీంట్లో 12ఎంపీ లెన్సులతో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 12ఎంపీ కెమెరాను అందించారు. ఇండస్ట్రీలో శాటిలైట్ ద్వారా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS సేవలను పరిచయం చేసిన మొదటి డివైజ్ ఇదే కావడం విశేషం.