Site icon HashtagU Telugu

Apple iPad Pro 2022 launched: అద్భుతమైన స్పెసిఫికేషన్లతో యాపిల్ ఐప్యాడ్ ప్రో 2022.. ధర, ఫీచర్లు ఇవే?

Apple Ipad Pro

Apple Ipad Pro

తాజాగా యాపిల్ ఐప్యాడ్ ప్రో 2022 ను లాంచ్ చేసింది. కాగా రెండు డిఫరెంట్ స్క్రీన్ సైజ్‌ లలో ఈ నయా ఐప్యాడ్ ప్రో వస్తోంది. అందులో ఒకటి 11 ఇంచులు, రెండవది 2.9 ఇంచుల డిస్‌ ప్లే వేరియంట్ లతో విడుదలయ్యాయి. ఈ ట్యాబ్‌ లో ఎమ్2 చిప్‌సెట్‌ ఉంటుంది. ఈ యాపిల్ ఐ పాడ్ ప్రో 2022 సెల్యూలార్ వేరియంట్ 5జీ కనెక్టివిటీ‌కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 2టీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. యాపిల్ ఐప్యాడ్ ప్రో స్పెసిఫికేషన్లో ధర ఫీచర్ల విషయానికి వస్తే..ఐప్యాడ్ ప్రో లేటెస్ట్, పవర్‌ఫుల్‌ ఎం2 ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది.

అయితే గత మోడల్ కంటే 15శాతం ఎక్కువ పర్ఫార్మెన్స్‌, మెరుగైన పవర్ ఎఫిషియెన్సీని ఇది ఇస్తుందని యాపిల్ పేర్కొంది. ఐప్యాడ్ ప్రో 2022 11 ఇంచుల మోడల్ 1688×2388 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 12.9 ఇంచుల మోడల్ 2048×2732 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే లిక్విడ్ రెటీనా ఎక్స్‌డీఆర్ మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే తో వస్తుంది. అదేవిధంగా థండర్‌బోల్ట్ 4, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచర్లను ఐప్యాడ్ ప్రో కలిగి ఉంది.

సెల్యులార్ మోడల్ 5జీ కనెక్టివిటీతో వస్తోంది. ఐప్యాడ్ ప్రో వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంటుంది. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్స్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ట్యాబ్‌ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాను యాపిల్ ఇచ్చింది. ఐప్యాడ్ ప్రో 11 ఇంచుల వైఫై మోడల్ ప్రారంభ ధర రూ.81,900, వైఫై సెల్యూలార్ మోడల్ ప్రారంభ ధర రూ.96,900గా ఉంది. అలాగే ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచుల వైఫై మోడల్ రూ.1,12,900 ప్రారంభ ధరతో వచ్చింది. వైఫై సెల్యూలార్ మోడల్ ప్రారంభ ధర రూ.1,27,900గా ఉంది. ఈ ఐప్యాడ్ ప్రో సిల్వర్, స్పేస్ గ్రే కలర్ లలో ఈ ట్యాబ్ లభిస్తుంది. 128జీబీ , 256జీబీ , 512జీబీ , 1టీబీ , 2టీబీ స్టోరేజ్ కన్ఫిగరేషన్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

Exit mobile version