Apple: యాపిల్ లవర్స్ కి గుడ్ న్యూస్.. కేవలం రూ.9 వేల లోపే యాపిల్ ఐప్యాడ్?

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది యువత యాపిల్ బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ ని వినియోగించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 06:15 PM IST

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది యువత యాపిల్ బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ ని వినియోగించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది యువతకు యాపిల్ ఫోన్స్, వాచ్ లు కొనుగోలు చేయడం అన్నది కల. అయితే వినియోగదారులకు అనుగుణంగా యాపిల్ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్స్ కలిగిన యాపిల్ స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ ఇయర్ బర్డ్స్ ని అతి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకు వస్తోంది.

మరి ముఖ్యంగా యాపిల్ సంస్థ కొత్త ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్,స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఆ సంగతి పక్కన పెడితే యాపిల్ లవర్స్ కి చక్కటి శుభవార్త.. అదేమిటంటే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్‌ ఐప్యాడ్‌ పై భారీ ఆఫర్‌ లభిస్తోంది. దాదాపు రూ. 42 వేల విలువైన యాపిల్ ఐప్యాడ్ కేవలం రూ. 8,900కే లభిస్తోంది. కాగా త్వరలో జరగనున్న గ్లోబల్‌ ఈవెంట్‌లో కొత్త యాపిల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేస్తుందన్న అంచనాల మధ్య ఈ ఆఫర్‌ ప్రముఖంగా నిలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది.

రూ. 41,900 వద్ద లిస్ట్‌ యాపిల్‌ లేటెస్ట్‌ యాపిల్ ఐప్యాడ్ పై దాదాపు 36వేల రూపాయలకు పైగా డిస్కౌంట్‌తో​​ అందుబాటులో ఉంది. అంటే కేవలం రూ. 8,900కే కొనుగోలుదారులు దక్కించుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ. 3000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ తో ధర రూ.38,900కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌ ద్వారారూ. 30,000 వరకు తగ్గింపు. అంటే అన్ని బ్యాంక్ ఆఫర్లు , డిస్కౌంట్ల తర్వాత, తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 8,900కి లభిస్తుంది. జూన్ 5 నుండి 9 వరకు యాపిల్‌ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది.