Site icon HashtagU Telugu

Honor : హానర్‌ నుంచి మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Another New Smart Phone From Honor In The Market.. The Price And Features Are The Same..

Another New Smart Phone From Honor In The Market.. The Price And Features Are The Same..

New Smart Phone from Honor : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ హానర్‌ (Honor) మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ ధరలో మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన హానర్ (Honor) సంస్థ తాజాగా మరో సరి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. హానర్‌ ఎక్స్7బీ (Honor X7B) పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ను అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

స్నాప్‌ డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. 6.8 ఇంచెస్‌ తో కూడిన ఎల్సీడీ స్క్రీన్‌ డిస్‌ప్లే ను ఈ ఫోన్‌ లో అందించారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్లో కెమెరాకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. 108 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ తో తీసుకొచ్చారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 35 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కూడా అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ మనకు.. ఎమరాల్డ్ గ్రీన్, ఫ్లోయింగ్ సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్ వంటి కలర్స్‌ లో లభించనుంది. ప్రస్తుతం చైనా మార్కెట్లో అందులోబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్ లోకి కూడా తీసుకురానున్నారు. ఇక ఈ ఫోన్‌ ధర రూ. 20 వేల వరకు ఉండవచ్చని అంచనా. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో.. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-పై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 2.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.,

Also Read:  Papaya for Beauty: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే బొప్పాయితో ఈ విధంగా చేయాల్సిందే?