Site icon HashtagU Telugu

WhatsApp Updates : వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. ఇకపై ఫోన్ నెంబర్ తో పని లేదట?

WhatsApp

Another New Feature In Whatsapp.. Phone Number No Longer Works..

WhatsApp New Updates : ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. దీంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ (WhatsApp) సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల ఆఫీసర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ సంస్థ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ (WhatsApp) సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

We’re Now on WhatsApp. Click to Join.

తాజాగా వాట్సాప్ (WhatsApp) సంస్థ ఇ-మెయిల్ చిరునామా ధృవీకరణను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే చాలు మీ వాట్సాప్ అకౌంట్ ఇంకాస్త ప్రొటెక్ట్ చేయబడుతుంది. మరి వాట్సాప్ (WhatsApp)లో ఈ మెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా వాట్సాప్ లాగిన్ అవ్వాలి అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ నువ్వు ఎంటర్ చేసిన తర్వాత మనకు వాట్సాప్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అయితే ఇది మొన్నటి వరకు అన్నమాట కానీ ఇప్పుడు ఈ మెయిల్ వెరిఫికేషన్ ద్వారా ఆరు అంకెల ఓటీపీ మెసేజ్ వస్తుంది. ఇది భద్రతను కూడా మరింత పెంచుతుంది. మొబైల్ నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు లేదా SMS ద్వారా కోడ్‌ను స్వీకరించలేనప్పుడు కూడా వాట్సాప్ ఖాతాలోకి సులభంగా లాగిన్ అయ్యేలా కొత్త ధృవీకరణ ఫీచర్ పరిచయం చేస్తున్నారు.

ఓటీపీ మెసెజ్ ఫోన్ రాకపోతే ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. అప్పుడు యూజర్ సులభంగా లాగిన్ కావచ్చు. కాగా వాట్సాప్ సంస్థ ఈ ఫీచర్ ను ఇప్పటికే iOS వినియోగదారుల కోసం ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఐఫోన్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఈ ఫీచర్ పరిచయం చేయనున్నారు. గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి వాట్సాప్ బీటా వెర్షన్‌ డౌన్ లోడ్ చేసుకొని ఈ ఫీచర్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ కార్నర్ లో త్రీ లైన్ డాట్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఆపై అకౌంట్స్ సెలెక్ట్ చేసి యాడ్ ఇ-మెయిల్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. అప్పుడు వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్‌ వస్తుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ వాట్సాప్2 తో లింక్ చేయబడుతుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ అడ్రస్ మార్చాలనుకుంటే అక్కడే చేంజ్ ఇ-మెయిల్ ఆప్షన్‌ పై క్లిక్ చేసి మార్చుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రానుంది.

Also Read:  Health Tips: మాంసాహారం ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త.. ఆ సమస్యలు రావడం ఖాయం?