Site icon HashtagU Telugu

OLA Electric E-Scooter: ఓలా నుంచి మరో కొత్త ఈ-స్కూటర్..

Ola Electric

Ola Electric

పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఖరీదులో దాదాపు సమానంగా ఉండడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఓలా (OLA) కంపెనీ కూడా సరికొత్త ఈ-స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఓలా ఎస్ 1 ఎయిర్ (OLA S1 Air) పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్కూటర్ ఖరీదు రూ.84,999 ల నుంచి మొదలవుతుందని, గరిష్ఠంగా రూ.1,09,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే దాదాపు 85 కిలోమీటర్ల నుంచి 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ స్కూటర్ ను 3 వేరియంట్లలో తీసుకొచ్చినట్లు వివరించారు. ఇందులో సరికొత్తగా 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ ఉందని తెలిపారు. రోజూ తక్కువదూరం ప్రయాణించే వారి కోసం.. అంటే రోజూ 20 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ స్కూటర్ (ఓలా ఎస్ 1) ను డిజైన్ చేశామన్నారు. దీని ఖరీదు రూ.99,999 మాత్రమేనని, ఒక్కసారి చార్జ్ చేసి 91 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని భవీష్ చెప్పారు.

Also Read:  E-Tipper: భారత్ లో తొలి ఈ–టిప్పర్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ ప్రయాణం