Transfer Whatsapp Chats: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఆ ఆప్షన్ తో చాట్స్ బదిలీ?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వాట్సాప్ ని వినియోగ

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 06:30 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వాట్సాప్ ని వినియోగిస్తూనే ఉన్నారు. రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో వాట్సాప్ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. సరికొత్త ఫీచర్ లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది వాట్సాప్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా వాట్సాప్‌లో వినియోగదారులు తమ చాట్ చరిత్రను అదే ఆపరేటింగ్ సిస్టమ్‌లోని పరికరాల మధ్య బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. మీరు మీ వాట్సాప్ చాట్‌లను కొత్త ఫోన్‌కి తరలించాలనుకుంటే మీ చాట్‌లు మీ డివైజ్‌లను వదలకుండా ఇప్పుడు మరింత ప్రైవేట్‌గా చేయవచ్చట. కాగా మెటా ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్‌తో స్పష్టమైన గోప్యత పద్ధతులు లేని అనధికారిక మూడవ పక్ష యాప్‌లను ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. అలాగే చాట్ చరిత్ర బదిలీ ప్రక్రియ క్యూఆర్‌ కోడ్‌తో ద్వారా ప్రమాణీకరించుకోవచ్చు. అలాగే డేటా కూడా రెండు పరికరాల మధ్య మాత్రమే భాగస్వామ్యం అవుతుంది.

అలాగే బదిలీ సమయంలో పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవుతుంది. చాట్ హిస్టరీని బ్యాకప్ చేయడం, రీస్టోర్ చేయడం కంటే ఈ ప్రక్రియ వేగవంతమైనదని మెటా ప్రతినిధులు పేర్కొంటున్నారు. వినియోగదారులు పెద్ద మీడియా ఫైల్‌లు, జోడింపులను కూడా బదిలీ చేయవచ్చు. చాట్ చరిత్ర బదిలీ ప్రక్రియను ప్రారంభించే ముందు రెండు పరికరాలు ఒకే వైఫైకు కనెక్ట్ అవ్వాలి. అలాగే పాత ఫోన్‌లో సెట్టింగ్‌లోకి వెళ్లి చాట్‌ల్లోకి వెళ్లి చాట్ బదిలీకి వెళ్లి, మీ కొత్త ఫోన్‌తో స్క్రీన్‌పై ప్రదర్శించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేయాలి. అంతే చాలా సింపుల్‌గా మీ చాట్స్‌ను బదిలీ చేయవచ్చు.