Noise New Smart Watch : నాయిస్ నుంచి మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ అదుర్స్..

నాయిస్ (Noise) కంపెనీ మరో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. దాని పేరు నాయిస్ ఫిట్ ఎన్డీవర్. ఇది రగ్గడ్ డిజైన్ తో వస్తుంది. దీని నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది.

  • Written By:
  • Updated On - December 16, 2023 / 04:07 PM IST

New Smart Watch from Noise : ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది స్మార్ట్ వాచ్ ని వినియోగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మాత్రమే కాకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్లను వినియోగిస్తున్నారు. రోజు రోజుకి ఈ స్మార్ట్ వాచ్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఒక స్మార్ట్ వాచ్ ని ప్రేక్షకులు వినియోగదారులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు స్మార్ట్ వాచ్ కంపెనీలు తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అలాంటి కంపెనీలలో నాయిస్ (Noise) కంపెనీ కూడా ఒకటి.

We’re now on WhatsApp. Click to Join.

అనువైన బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు, క్లాసిక్ డిజైన్లో నాయిస్ (Noise) కంపెనీ స్మార్ట్ వాచ్ లు వస్తుంటాయి. ఇదే క్రమంలో నాయిస్ కంపెనీ మరో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. దాని పేరు నాయిస్ ఫిట్ ఎన్డీవర్. ఇది రగ్గడ్ డిజైన్ తో వస్తుంది. దీని నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను కూడా నాయిస్ అనువైన బడ్జెట్లోనే లాంచ్ చేసింది. రూ. 2,999 బేస్ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాగా ఈ స్మార్ట్ వాచ్ మనకు స్మార్ట్ వింటేజ్ బ్రౌన్, ఫియారీ ఓరెంజ్, టీల్ బ్లూ, కామో బ్లాక్, జెట్ బ్లాక్ వంటి 5 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మరి తాజాగా విడుదలైన ఈ స్మార్ట్ వాచ్ కి సంబంధించిన మరిన్ని వివరాల విషయానికి వస్తే.. ఎండీవర్ సాహస ఔత్సాహికుల కోసం ఉద్దేశించబడింది..ఎస్ఓఎస్ తో సహా ఫీచర్లు ఉన్నాయి.

ఇది వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా వారి ప్రత్యక్ష స్థానాన్ని తక్షణమే భాగస్వామ్యం చేయడానికి, కేవలం 8 సెకన్లలోపు ఐదు అత్యవసర ఫోన్ కాంటాక్ట్ లను సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. 100 సెకన్లలో శరీర ఆరోగ్య నివేదికను అందించే రాపిడ్ హెల్త్ మెజర్‌మెంట్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది..ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.46-అంగుళాల హై-పిక్సెల్ అమోల్డ్ డిస్‌ప్లే 600 నిట్‌ల బ్రైట్‌నెస్, ఆల్వేస్-ఆన్-డిస్ప్లే, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్, హృదయ స్పందన రేటు, ఎస్పీఓ2, నిద్ర విధానాలు వంటి ముఖ్యమైన ఆరోగ్య కొలమానాలను ట్రాక్ చేయడానికి వెల్‌నెస్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఒత్తిడి స్థాయిలు, శ్వాస వ్యాయామాలు. నీరు, ధూళి నిరోధకత కోసం వాచ్ ఐపీ68గా రేటింగ్ ఇచ్చారు. స్మార్ట్‌వాచ్ ఇటీవలి కాల్ లాగ్‌లను యాక్సెస్ చేయడానికి, గరిష్టంగా 10 పరిచయాలను సేవ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Also Read:  Hatchback And Sedan: హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారు మధ్య తేడా ఏమిటి? మీకు ఏది బెస్ట్ గా ఉంటుందంటే..?