Farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఆ టెక్నాలజీతో పంటలను రక్షించుకోవచ్చు

  • Written By:
  • Updated On - March 5, 2024 / 12:03 AM IST

Farmers: ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని పంటలకు రక్షణ చేసేవారు రైతులు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారతీయ సకశేరుక( విభాగం ఓ కొత్త పరికరం రూపొందించింది. సులువుగా పొలాల్లోకి తీసుకెళ్లడంతో పాటు పంట పొలాల్లోని ఓ చిన్న చెట్టు కొమ్మ ఉంటే చాలు దానికి వేలాడ దీసుకునేలా తయారు చేశారు.

ఈ పరికరం పేరు ‘ఈ కెనాన్’. సోలార్ సిస్టంద్వారా ఈ కెనాన్ పని చేస్తుంది. ఈ పరికరంలో వివిధ రకాల శబ్దాలను పొందుపరిచారు. అందులో పులులు, సింహాల గాండ్రింపులు, గన్ శబ్దం, మనుషులు, పక్షుల అరుపులతో పాటు 20 రకాల శబ్దాలతో కూడిన ఒక చిప్ ను తయారు చేసి ఇందులో ఉంచారు.

ఎండలో సుమారు రెండు గంటలు ఉంటే చాలు ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. 12 గంటల పాటు నిరంతరం వివిధ రకాల శబ్దాలు వస్తూనే ఉంటాయి. ఉదయం పక్షులను రాకుండా చూడటంతో పాటు, రాత్రి సమయాల్లో అడవి పందుల దాడులు చేయకుండా బెదరగొట్టడానికి ఈ యంత్రం ఉపయోగపడుతోంది. 110 డెసిబుల్స్ శబ్ధం వినిపిస్తుంది. రైతులకుఅందుబాటులోకి ఉండేలా అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో రూ. 18 వేలతో ఇవి దొరుకుతున్నాయి. ఆదిలాబాద్ రైతులకు కావాలంటే కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చి తెలియజేస్తే, ఎన్ని కావాలో తెప్పిస్తామని శాస్త్రవేత్త కె.రాజశేఖర్ చెబుతున్నారు.