Android Phone Connectivity: ఆండ్రాయిడ్‌ ఫోన్స్ ఇక శాటిలైట్ తో కనెక్ట్.. “14” ఆపరేటింగ్ సిస్టమ్ సంచలనం!!

ఆండ్రాయిడ్‌ ఫోన్ కు మొబైల్ నెట్ వర్క్ అందితేనే సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తాయి..

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 07:30 AM IST

ఆండ్రాయిడ్‌ ఫోన్ కు మొబైల్ నెట్ వర్క్ అందితేనే సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తాయి..

మొబైల్ నెట్ వర్క్ అందకుంటే ఫోన్ సిగ్నల్స్ రావు..

ఈ పరిమితిని అధిగమించేలా ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్
వచ్చే ఏడాది రాబోతోంది. ఇది శాటిలైట్ కమ్యూనికేషన్‌ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే 14 వెర్షన్‌పై గూగుల్ పని చేస్తోందని
ఒకో సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి లాకెమర్ వెల్లడించారు.

ఏమిటీ శాటిలైట్ కనెక్టివిటీ ?

డెడ్ జోన్స్‌‌ అంటే ఎలాంటి సెల్‌ఫోన్ టవర్స్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లోనూ ఈ శాటిలైట్ కనెక్టివిటీతో కాల్స్, ఎస్ఎంఎస్‌లు సాధ్యమవుతాయి. టెలికం సిగ్నల్స్ లేకున్నా శాటిలైట్ ఆధారంగా ఈ కనెక్టివిటీ వీలవుతుంది. ఇటీవల ఈ శాటిలైట్ కనెక్టివిటీ కోసం స్పేస్‌ఎక్స్‌ తో టీ-మొబైల్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. డెడ్‌జోన్స్‌లోనూ స్టార్‌లింక్‌ వీ2తో శాటిలైట్స్‌తో కనెక్టివిటీని అందించేందుకు స్పేస్ ఎక్స్‌తో చేతులు కలిపింది. ఇక ఈనెల 7వ తేదీన లాంచ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్‌ మొబైళ్లలోనూ ఈ శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్ ఉండనుంది. ఐఫోన్ 13 మొబైళ్లకు కూడా ఈ సదుపాయం వస్తుందని అంచనా.

ఎలా పనిచేస్తుంది?

మొబైల్ ఫోన్ కు శాటిలైట్ కనెక్టివిటీని అందించాలంటే ముందుగా మొబైల్‌ తయారీ సంస్థ కానీ, టెలికం సంస్థ కానీ శాటిలైట్ ఆపరేటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో.. అవసరమైతే వేరే ప్రాంతాల్లోనూ శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ సాధ్యమయ్యేలా చేయవచ్చు. కాల్స్‌తో పాటు ఎస్ఎంఎస్‌లు కూడా సాధ్యమవుతాయి. డేటా సదుపాయం కూడా అవకాశం ఉన్నా స్పీడ్ చాలా పరిమితంగా ఉంటుందని తెలుస్తోంది.

అమెరికా ముందడుగు..

అమెరికాలో టీ-మొబైల్‌ టెలికమ్యూనికేషన్స్ సంస్థ.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ వీ2 మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ సాయంతో శాటిలైట్ కనెక్టివిటీని ఇచ్చేందుకు సిద్ధమైంది. 2023 చివరి నాటికి ఈ శాటిలైట్ బేస్డ్ మొబైల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ముందుగా టెక్స్ట్ మెసేజింగ్ సదుపాయం వస్తుంది. ఆ తర్వాత కాలింగ్, ఇంటర్నెట్ సపోర్ట్ కూడా తీసుకురావడమే T-Mobile లక్ష్యంగా పెట్టుకుంది.