Site icon HashtagU Telugu

Earth From Mars: అంగారక గ్రహం నుంచి భూమిని చూస్తే ఇలా కనిపింస్తుందట.. వైరల్ ఫోటో?

Mars

Mars

అంతరిక్షంకి సంబంధించిన శాస్త్రవేత్తలు మానవ మనుగడ కేవలం భూగ్రహం మీద కాకుండా ఇంకా ఇతర గ్రహాలపై నివసిస్తున్నారా? లేకపోతే అక్కడ నివసించవచ్చా? మానవుడు అక్కడ నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? లాంటి విషయాలను కనుగొనే పనిలో పడ్డారు. కాగా భూగ్రహం మీద నుంచి ఇప్పటికే ఎన్నో రకాల శాటిలైట్లను స్పేస్ లోకి పంపించిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా అంగారక గ్రహం పై తీవ్ర పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి మనుషులను కూడా పంపించిన విషయం తెలిసిందే.

Also Read:  Space Telescope: గ్రహశకలం ఢీకొనడంతో భారీగా దెబ్బతిన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్?

కాగా మనకు భూమి మీద నుంచి ఆకాశంలోకి చూస్తే పెద్ద పెద్ద గ్రహాలు, చిన్న చిన్న గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఇతర గ్రహాలపై నుంచి భూమి ఎలా కనిపిస్తుంది అన్న ప్రశ్న శాస్త్రవేత్తలకు తలెత్తడంతో వెంటనే ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే పనిలో పడ్డారు. మరి ఇతర గ్రహాల నుంచి మన భూమి ఎలా కనిపిస్తుంది అన్న ప్రశ్నకు ఈ ఫోటోనే  చక్కటి సమాధానం. శాస్త్రవేత్తలు అంగారక గ్రహం పై నుంచి చూస్తే భూమి ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ఒక ఫోటోని విడుదల చేశారు.

Also Read:  High-Flying Experiment: అంతరిక్షంలో మనుషుల స్టెమ్ సెల్స్ పై ప్రయోగం లోగుట్టు!!

అయితే అందరికి గ్రహం పైనుంచి చూస్తే భూమి ఏ విధంగా ఉంటుందో చూడాలి అని అనుకునే వారికి ప్రముఖ పరిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా ఒక ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆ ఫోటోని చట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ ఫోటో మనకు ఏదైనా ఒకటి నేర్పుతుందంటే అది వినయమే అంటూ ఆనందమహింద్ర ట్వీట్ చేశారు. అంగారకుడిపై వున్న నాసా క్యూరియాసిటీ రోవర్ దీన్ని తీసింది. ఈ అద్భుతమైన ఫొటో మార్స్ నుంచి తీసినది. అంగారక గ్రహం మీద నుంచి ఓ చిన్న నక్షత్రం మాదిరిగా కనిపిస్తున్నదే మన ప్రియమైన భూగ్రహం అని నాసా పేర్కొంది.

 

 

Exit mobile version