Site icon HashtagU Telugu

Samsung: శాంసంగ్‌ మరో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన మొబైల్ ఇదే!

Samsung

Samsung

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లోకి విడుదల అయిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరకే ఏదో స్మార్ట్ ఫోన్ లు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మార్కెట్ లోకి విడుదల అయినా స్మార్ట్ ఫోన్ లలో శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్స్ కూడా ఒకటి. ఈ సాంసంగ్ కంపెనీ నుంచి రకరకాల స్మార్ట్ ఫోన్లు విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతి తక్కువ ధర కలిగిన ఫోన్‌ ని విడుదల చేసింది.

ఇటీవలే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. కొత్త ఫోన్ పేరు గెలాక్సీ ఎఫ్06 5జీ. ఈ ఫోన్ భారతదేశంలో శాంసంగ్‌ ప్రారంభించిన అత్యంత చౌకైన 5జీ ఫోన్. అయితే గత కొన్ని రోజులుగా అనేక మొబైల్ తయారీ దారులు రూ. 10,000 కంటే తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శాంసంగ్‌ కూడా 10,000 యూనిట్ల కంటే తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ ఫోన్‌ తో 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ లోకి ప్రవేశిస్తోంది. కంపెనీ తన చౌకైన 5జీ స్మార్ట్‌ ఫోన్ గెలాక్సీ F06 5జీ ని విడుదల చేసింది.

ఇండియాలో ఎక్కువ మందికి 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడమే ఈ స్మార్ట్‌ ఫోన్ లక్ష్యం అని. చెప్పాలి. భారతదేశంలో 5G నెట్‌ వర్క్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. కాగా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,499 నుండి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 10,000 కంటే తక్కువ ధరకే 5జీ ని అందిస్తుంది. వినియోగదారులకు ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ఇలా ఫైవ్ జి స్మార్ట్ ఫోన్లలో అతి తక్కువ ధరకే లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో ఈ ఫోన్ మొదటి స్థానంలో ఉంది. ధర విషయంలోనే కాకుండా ఫీచర్ల విషయంలో కూడా ఆహా అనిపిస్తోంది. తక్కువ ధరకే బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికి ఇది బెస్ట్ ఎంపిక అని చెప్పాలి.