Apple Vision Pro : యాపిల్ విజన్ ప్రో.. ఏమిటిది ? ధర ఎంత ? లాంచ్ ఎప్పుడు ?

ఇటీవల తన తండ్రి అమితాబ్ బచ్చన్‌కు అభిషేక్ బచ్చన్‌ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. 

  • Written By:
  • Updated On - May 16, 2024 / 09:24 AM IST

Apple Vision Pro : ఇటీవల తన తండ్రి అమితాబ్ బచ్చన్‌కు అభిషేక్ బచ్చన్‌ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.  దాన్ని అమితాబ్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్పెషల్ గిఫ్ట్ మరేదో కాదు.. యాపిల్ విజన్ ప్రో. దాదాపు రూ.3 లక్షల ధర ఉన్న యాపిల్ విజన్ ప్రోను ధరించి అమితాబ్ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన హెడ్ సెట్ ద్వారా ఫొటోలు, వీడియోలను చూసి ఆయన ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఈనేపథ్యంలో ఏమిటీ యాపిల్ విజన్ ప్రో (Apple Vision Pro)? దానిలోని ఫీచర్లు ఏమిటి ? ఇండియాలో ఎప్పుడు విడుదల అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఇండియాలో లాంచ్ ఎప్పుడు ?

ఏఆర్, వీఆర్ టెక్నాలజీతో డిజైన్ చేసిన ‘యాపిల్ విజన్ ప్రో’ ఇప్పటికే అమెరికాలో విడుదలైంది. అక్కడ దాని ధర దాదాపు రూ.3 లక్షలు ఉంది. అభిషేక్ బచ్చన్ తన తండ్రికి గిఫ్ట్ చేసేందుకు అమెరికా నుంచి దాన్ని తెప్పించారు. తదుపరిగా  జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, చైనా దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన యాపిల్ సిబ్బందికి యాపిల్ విజన్ ప్రో పరికరాల నిర్వహణపై ట్రైనింగ్ ఇస్తున్నారు.

Also Read : Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు

‘యాపిల్ విజన్ ప్రో’ ఫీచర్లు

  • ‘యాపిల్ విజన్ ప్రో’  అనేది మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్. ఇందులో ఏఆర్, వీఆర్ టెక్నాలజీ ఉంటుంది.
  • ఇది ‘విజన్ఓఎస్’ అనే  ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది.
  • ఇందులో రెండు మైక్రో ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉంటాయి.
  • యాపిల్ విజన్ ప్రో 23 మిలియన్ పిక్సెల్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులోని కస్టమ్ 3డీ లెన్స్ ద్వారా ఏఆర్ కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు.
  •  హై స్పీడ్ కెమెరాలతో కూడిన ఫుల్ సెన్సార్లు, హ్యాండ్ ట్రాకింగ్ కోసం కింది వైపు కెమెరాలు, ఐఆర్ ఇల్యూమినేటర్లు, సైడ్ కెమెరాలు ఇందులో ఉన్నాయి.
  • ఎం2 చిప్‌, ఆర్1 చిప్‌లపై యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ రన్ అవుతుంది.
  • ఏఆర్/వీఆర్ హెడ్‌సెట్‌లో 12 కెమెరాలు, ఐదు సెన్సార్లు, ఆరు మైక్రో ఫోన్లు ఉంటాయి.
  • కంటికి సైట్ ఉన్న యూజర్లు కూడా దీన్ని ఉపయోగించేందుకు జీస్ ఆప్టికల్ ఇన్‌సెర్ట్స్‌ ఉంటుంది.
  • వినియోగదారుల ఐరిస్‌ను గుర్తించేలా యాపిల్ విజన్ ప్రోలో ఆప్టిక్ ఐడీ ఫీచర్‌ ఉంది.
  • ఐఫోన్‌ను ఫేస్ ఐడీతో మాత్రమే అన్‌లాక్ చేయొచ్చు.  యాపిల్ విజన్ ప్రోను కూడా ఆప్టిక్ ఐడీతోనే  అన్‌లాక్ చేయొచ్చు.

Also Read :Who is Shooter : స్లొవేకియా ప్రధానిపై కాల్పులు.. 71 ఏళ్ల ముసలాయనే షూటర్