Ambrane Powerbank: మార్కెట్లోకి బాహుబలి పవర్ బ్యాంక్.. ఫోన్లతో పాటు లాప్టాప్స్ కి కూడా?

మనం ఎక్కడికైనా లాంగ్ టూర్ కి వెళ్తున్నప్పుడు మనకు కరెంట్ అందుబాటులో లేనప్పుడు పవర్ బ్యాంకు ఎంతో బాగా

Published By: HashtagU Telugu Desk
Ambrane Powerbank

Ambrane Powerbank

మనం ఎక్కడికైనా లాంగ్ టూర్ కి వెళ్తున్నప్పుడు మనకు కరెంట్ అందుబాటులో లేనప్పుడు పవర్ బ్యాంకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోజుల్లో అయితే ప్రతి పదిమందిలో ఆరుగురు దగ్గర తప్పకుండా పవర్ బ్యాంకు ఉంటుంది.. ఈ పవర్ బ్యాంకులో పవర్ కట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల పవర్ బ్యాంకు లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో నాసిరకమైన పవర్ బ్యాంక్స్ అలాగే బ్రాండెడ్ పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త పవర్ బ్యాంక్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టెక్ కంపెనీ అంబ్రేన్ తాజాగా కొత్త పవర్ బ్యాంక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

దీని ద్వారా కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ల్యాప్ టాప్స్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా దీని కెపాసిటీ కూడా 40,000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ మేడిన్ ఇండియా పవర్ బ్యాంక్ ద్వారా ఫోన్లను సులభంగానే వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. ల్యాప్స్ టాప్స్, ట్యాబ్స్ వంటి వాటికి కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌కు 180 రోజుల వారంటీ ఉంటుంది. దీని కెపాసిటీ 40000 ఎంఏహెచ్. ఇది లిథియం పాలీమర్ బ్యాటరీ. పవర్ బ్యాంక్‌లోని 65 వాట్ పీడీ ఫాస్ట్ చార్జింగ్ ఔట్‌పుట్, 20 వాట్ డీసీ 2.0 ఔట్ ‌పుట్ ద్వారా స్మార్ట్‌ఫోన్స్ వేగంగా చార్జ్ అవుతాయి. అంతేకాకుండా ఇందులో 60 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఇన్‌పుడ్ కూడా ఉంది. అంటే పవర్ బ్యాంక్ కూడా వేగంగా ఫుల్ అవుతుంది.

ఈ పవర్ బ్యాంక్‌లో రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. ఒక టైప్ సీ పోర్ట్ ఉంటుంది. వీటి ద్వారా మల్టీపుల్ డివైజ్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎల్ఈడీ ఇండికేటర్ ఉంటుంది. కంపెనీ కొత్తగా తీసుకువచ్చిన ఈ అంబ్రేన్ స్టైలో బూస్ట్ పవర్ బ్యాంక్ ధర రూ. 4,299గా ఉంది. దీనిని ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ ఫోన్ బ్యాంకు మనకు బ్లూ, గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.

  Last Updated: 06 Feb 2023, 08:36 PM IST