Amazon: అమెజాన్ లో భారీ ఆఫర్స్.. 5జి ఫోన్లతో పాటు ఆ ఫోన్ లపై కూడా?

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Amazon

Amazon

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువుల పై అలాగే ఇతర వాటిపై భారీగా డిస్కౌంట్ లను ఇస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెజాన్ సంస్థ స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్‌ సేల్‌ ను మొదలు పెట్టింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్‌ ఫోన్స్‌ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. మరి ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్‌ తో పాటు, వన్‌ప్లస్‌ 10 ప్రో, ఐఫోన్‌ 14, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3 సహా అనేక స్మార్ట్‌ ఫోన్‌ లపై డిస్కౌంట్లను అందిస్తుంది.

ఈ ఫోన్ లను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ తో పొందవచ్చు. అలాగే రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు తగ్గింపు ధరను పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు అనగా పది శాతం తగ్గింపును పొందవచ్చు. ఇకపోతే అమెజాన్ ఆఫర్లు విషయానికి వస్తే.. శాంసంగ్‌ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699 కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. అదేవిధంగా రెడ్‌మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం కేవలం రూ. 6,119 కి లభించనుంది.

రెడ్‌మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్‌ మీ నోట్‌ 11 రూ. 10,999 లకు కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఎఫ్‌ 21ఎస్‌ ప్రొ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఇకపోతే ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌గా అదనంగా రూ. 3,000 తగ్గింపుగా కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్‌లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి లభిస్తున్నాయి. ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్‌​ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్‌3 రూ.6,299కే లభ్యం. టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్‌ 19 మాండ్రియన్‌ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో లభించనున్నాయి..

  Last Updated: 11 Dec 2022, 09:28 PM IST