Site icon HashtagU Telugu

Amazon Laptop Offers: ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే!

Amazon Laptop Offers

Amazon Laptop Offers

ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్ ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రం హోం వచ్చినప్పటి నుంచి ఈ ల్యాప్‌టాప్ వినియోగం మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఆఫీస్ వర్క్ మీద మాత్రమే కాకుండా చాలామంది మూవీస్ చూడడం కోసం అలాగే ఇతర ప్రయోజనాల కోసం కూడా ఈ ల్యాప్‌టాప్ ని వినియోగిస్తున్నారు. దీంతో వీటికి ఉన్న డిమాండ్ కూడా పెరిగిపోవడంతో కంపెనీలు మంచి మంచి ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్ లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు, మార్కెట్లోకి విడుదల చేసిన ల్యాప్‌టాప్ లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

ప్రస్తుతం అమెజాన్ సంస్థ ల్యాప్‌టాప్ లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. మరి ఏ ల్యాప్‌టాప్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది అన్న విషయానికి వస్తే.. లెనోవో ల్యాప్‌టాప్ పై అమెజాన్‌ లో 33 శాతం డిస్కౌంట్‌ తో లభిస్తోంది. వర్క్ ఫ్రం హోం చేసేవారికి అనువైంది. అలాగే హైఫ్రేమ్ రేట్ వీడియోలకు కూడా ఇది బాగుంటుంది. స్టోరేజ్ సామర్ధ్యం కూడా ఎక్కువ. కంటెంట్ క్లారిటీ బాగుంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 38,990 రూపాయలుగా ఉంది. హెచ్ పి కంపెనీ ల్యాప్‌టాప్‌లలో అతి తక్కువ ధరకు లభిస్తున్న లాప్టాప్ హెచ్ పి 15ఎస్. ఇందులో ఏఎంజీ రైజెన్ ప్రాసెసర్ ఉంటుంది. దాంతో వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఆన్‌లైన్ గేమింగ్ వంటివాటికి అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాకప్ స్టోరేజ్ కూడా ఎక్కువ. వీడియో కాల్స్, మీటింగులకు అనువుగా ఉంటుంది.

ఈ ల్యాప్‌టాప్ ధర 38 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 29,990 రూపాయలకు లభిస్తోంది. అలాగే హెచ్ పి 12 జన్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రోసెసర్ ఉంటుంది. యూహెచ్‌డి గ్రాఫిక్ కార్డ్ ఉండటంతో గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్‌లైన్ గేమర్లకు బాగుంటుంది. బ్యాకప్ స్టోరేజ్ కూడా ఎక్కువ. ఈ ల్యాప్‌టాప్ 34 శాతం డిస్కౌంట్ అనంతరం 37,998 రూపాయలకు లభిస్తోంది. అదేవిధంగా అసూస్ వివో బుక్ థిన్ అండ్ లైట్ లాప్టాప్ పై కూడా అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తుంది. కాగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌లలో ఇది బెస్ట్. ఇది అల్ట్రా లైట్ డిజైన్‌తో కస్టమర్లకు అత్యధికంగా ఆకట్టుకుంటోంది. ప్రోసెసర్ వేగంగా ఉంటుంది. రిఫ్రెష్ రేట్ ఎక్కువ. మల్టీ మీడియా ఎక్విప్‌మెంట్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కనెక్ట్ చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 39 శాతం డిస్కౌంట్ తరువాత 34,990 రూపాయలకు లభిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఆమెజాన్ ను ఒక్కసారి చెక్ చేయండి.