Amazon Prime lite: అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సభ్యత్వ ప్రారంభం..వార్షిక ప్లాన్ వివరాలివే?

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గురించి మనందరికీ తెలిసిందే. కాగా వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం అమెజాన్ అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లైట్

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 06:07 PM IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గురించి మనందరికీ తెలిసిందే. కాగా వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం అమెజాన్ అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సభ్యత్వ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది ఆరంభంలో కొంతమంది కస్టమర్ లతో ప్లాన్‌ను ప్రారంభించామని, ఇప్పుడు వినియోగదారులందరికీ యాక్సెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేర్కొంది. భారత్ లో అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని అమెజాన్ సంస్థ తెలిపింది.

భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక చందా రూ. 999కే లభిస్తుంది అని తెలిపింది. ఈ వార్షిక ప్లాన్‌ తీసుకున్న కస్టమర్ లకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా తీసుకున్న కస్టమర్లకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా రెండు రోజులపాటు ఉచిత డెలివరీ చేస్తామని సంస్థ తెలిపింది.సాధారణ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పోలిస్తే ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. కాగా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లైట్ ధర ఒక సంవత్సరానికి రూ. 999 గా ఉంది. ఇది సాధారణ ప్లాన్ కంటే చాలా తక్కువ.

అలాగే ఏడాది సాధారణ ప్లాన్ రూ.1,499 గా ఉంటుంది. ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. కొత్తగా ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు పొందాలనుకునే కస్టమర్లకు ఇది చౌకైన ప్రత్యామ్నాయం. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ తో అమెజాన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులకు అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీకి అనుమతి ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.