Samsung Smartphone: బంపర్ ఆఫర్.. గెలాక్సి స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.40 వేల తగ్గింపు?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్

Published By: HashtagU Telugu Desk
5G SmartphonesLava

5G Smartphones

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లలో కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీ బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే రాజ్యాంగ కూడా శాంసంగ్ ఫోన్ పై బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

ఈ ఆఫర్ ద్వారా మీరు ఏకంగా రూ.40 వేల తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999 గా ఉంది. అయితే అమెజాన్‌లో అందిస్తున్న భారీ తగ్గింపు ఆఫర్ ద్వారా మీరు ఈ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ ఫోన్‌ని కేవలం రూ. 34,999 కే పొందవచ్చు. ఇంకా ఈ ఫోన్‌పై బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, Qualcomm Snapdragon 865 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌‌తో పాటు 1టీబీ వరకు స్టోరేజీని పెంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే..

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరాగా 12 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్‌, 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ సెకండరీ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. అయితే కేవలం ఇవే కాకుండా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే, 15W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ సప్పోర్ట్ చేస్తుంది.

  Last Updated: 31 Jul 2023, 07:04 PM IST