Site icon HashtagU Telugu

Amazon Offers: ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. కేవలం రూ.20 వేలకే ఐఫోన్?

Mixcollage 17 Jul 2024 04 49 Pm 2280

Mixcollage 17 Jul 2024 04 49 Pm 2280

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే స్మార్ట్ ఫోన్ లలో ఐఫోన్ కూడా ఒకటి. ఈ ఫోన్ లకు మార్కెట్లో భారీగా క్రియేట్ డిమాండ్ కూడా ఉంది. చాలామందికి ఈ ఫోన్ ని వినియోగించాలని ఆశ ఉన్నప్పటికీ వాటి ధరల కారణంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. మిగతా ఫోన్లతో పోల్చుకుంటే ఐఫోన్ల ధర ఎక్కువగా ఉండడంతో పాటు అనేక ప్రత్యేకతలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు ఆపిల్ కంపెనీ అప్ డేట్ చేస్తూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందజేస్తోంది.

ఇటీవల కాలంలో సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకే ఐఫోన్ ను విడుదల చేస్తోంది ఆపిల్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారులకు చక్కటి శుభవార్తను తెలిపింది. అదేమిటంటే ఐఫోన్ 15 అత్యంత తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ని రూ.20 వేలకు సొంతం చేసుకోవచ్చు. కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికీ, ఐఫోన్ ను ఉపయోగించాలనే కోరిక ఉన్నవారికి ఇదే మంచి అవకాశం అని చెప్పాలి. అమెజాన్ లో ప్రస్తుతం ఐఫోన్ 15 128 జీబీ, బ్లాక్ ఫోన్ ను కేవలం రూ. 20,150 కు సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్‌ ను కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప అవకాశం.

అయితే ఈ ధరలో ఫోన్ ను పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 15, 128 జీబీ, బ్లాక్ ప్రస్తుతం రూ.79,900కు అందుబాటులో ఉంది. దీనిపై 11 శాతం తగ్గింపును ప్రకటించారు. దీంతో రూ.70,999 కు ధర తగ్గింది. అలాగే వినియోగదారులు తమ పాత ఫోన్‌ను మంచి స్థితిలో ట్రేడింగ్ చేయడం ద్వారా 44,925 వరకూ ఆదా చేసుకోవచ్చు. దానితో ఐఫోన్ 15ను రూ. 26,074కి తగ్గించే అవకాశం కలుగుతుంది. అదనంగా అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి రూ.5,924 వరకూ తగ్గింపు అందిస్తున్నారు. దీంతో ఐఫోన్ 15ను చివరికి రూ.20,150 సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఫోన్ను కొనుగోలు చేసేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనే చెప్పాలి. ఇకపోతే ఈ ఐఫోన్ 15 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.1 అంగుళాల డిస్ ప్లే ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ మనకు గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు తదితర ఆకర్షణీయమైన రంగులలో ఫోన్ లభిస్తుంది.

ఐఫోన్ 14 ప్రో మోడల్ లోని డైనమిక్ ఐలాండ్ నాచ్‌ని దీనిలో పరిచయం చేసింది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ అమర్చారు. దీంతో అన్ని సమయాలలోనూ మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ పనితీరు చాలా మెరుగుగా ఉంది. దాదాపు 9 గంటలపైగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తుంది. తరచూ చార్జింగ్ చేసుకునే అవసరం ఉండదు ఏ16 బయోనిక్ చిప్ ఆధారిత ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లలో వినియోగించిన ఏ15 చిప్ నుంచి దీనిని అప్‌గ్రేడ్ చేశారు. ప్రో మోడళ్లలో కూడా ఏ16 రకం చిప్ లు ఉపయోగించారు. ఐఫోన్ 15 లో యూఎస్ బీ టైప్- సీ ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు.