Site icon HashtagU Telugu

Tecno pova5 pro: రూ. 20 వేల ఫోన్ కేవలం రూ. 12 వేలకే.. పూర్తి వివరాలు ఇవే!

Tecno Pova5 Pro

Tecno Pova5 Pro

ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కావడంతో స్మార్ట్ ఫోన్లు కార్లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి ఆయా కంపెనీలు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై కొన్ని వేల తగ్గింపుతో అత్యంత తక్కువ ధరకే అందిస్తున్నాయి. అలాగే ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు టెక్నో స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 8000 రూపాయల డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. అంటే 20000 రూపాయల స్మార్ట్ ఫోన్ కేవలం 12000 కి అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. టెక్నో పోవా 5 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

స్టన్నింగ్‌ లుక్‌తో డిజైన్ చేసిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. కాగా టెక్నో పోవా 5ప్రో స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 14,999 కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌పై అదనంగా రూ. 1750 కూపన్‌తో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్‌ ని పొందవచ్చు. దీంతో ఈ ఫోన్‌ ను రూ. 12 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇండియాలో మొదటి కలర్డ్‌ బ్యాక్‌లిట్‌ ఏఆర్‌సీ ఇంటర్‌ఫేస్‌ తో ఈ ఫోన్‌ ను తీసుకొచ్చారు.

ఇందులో 6.78 ఇంచెస్‌ తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డాన్‌ ఇన్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ లో 68 వాట్స్‌ కు సపోర్ట్ చేసే అల్ట్రా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని కూడా అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. అలాగే ఇందులో స్నాప్‌ డ్రాగన్ ప్రాసెసర్‌ ను కూడా ఇచ్చారు. ఈ ఫోన్‌ లో గరిష్టంగా 16 జీబీ ర్యామ్‌ ను అందించారు. కాంటాక్ట్ లెస్‌ ఆపరేషన్స్‌ కోసం ఇందులో ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్‌ ను అందించారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ లో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఫోన్ ని కొనుగోలు చేసి డబ్బులు ఆదా చేసుకోండి.