Site icon HashtagU Telugu

OnePlus 12: వన్ ప్లస్ 12 ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే!

Oneplus 12

Oneplus 12

వన్ ప్లస్ ఫోన్లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయినప్పటికీ కొత్త కొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లు పై బంపర్ ఆఫర్లను కూడా అందిస్తూ ఉంటుంది వన్ ప్లస్. ఇకపోతే వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌ పై మంచి ఆఫర్‌ అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 64,999కాగా అమెజాన్‌ లో ఏకంగా రూ. 5,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.

అంటే ఈ పోన్‌ను రూ. 59,500కి సొంతం చేసుకోవచ్చట. అయితే ఈ ఆఫర్ ఇక్కడితోనే ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా భారీగా డిస్కౌంట్‌ పొందే అవకాశం కల్పించారు. ఈ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ఈ డిస్కౌంట్‌ ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో శక్తివంతమైన స్నాప్‌ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ ను అందించారు. అలాగే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ProXDR డిస్‌ప్లేను కూడా అందించారు.

120 Hz రిఫ్రెష్ రేట్‌ కు ఈ స్క్రీన్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో యాప్ లాక్, హైడ్ యాప్‌ ల వంటి ఉపయోగకరమైన ఫీచర్లను ఇన్‌బిల్ట్‌ గా అందించారు. నాలుగేళ్ల పాటు కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌ లను, 5 సంవత్సరాల పాటు అప్‌డేట్‌ లను అందిస్తుంది. ఇకపోతే ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 80 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సోపర్ట్‌ చేసే 5400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. వేగంగా ఛార్జింగ్ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు. మరింత సమాచారం కోసం ఒకసారి అమెజాన్ సైట్ ను చెక్ చేయడం మంచిది.

Exit mobile version