Site icon HashtagU Telugu

OnePlus Nord 3 5G:రూ.34 వేల స్మార్ట్ ఫోన్ రూ.9 లకే.. పూర్తి వివరాలు ఇవే?

Oneplus Nord 3 5g

Oneplus Nord 3 5g

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపును ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అనగా జూలై నెలలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది విషయం తెలిసిందే. మిడ్ రేంజ్‌ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా వచ్చిన వన్‌ప్లస్ నార్డ్‌3 యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారీ తగ్గింపు ధరతో రూ.9 లకే లభిస్తోంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఊహకందని ఆఫర్‌ను అందించింది అమెజాన్‌. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 33,999కాగా ఎక్సఛేంజ్‌లో రూ. 24,900 డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా ఈ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఒకవేళ మీ పాత ఫోన్‌పై మొత్తం ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ వర్తిసే ఈ ఫోన్‌ను కేవలం రూ. 9,099కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్‌ కండిషన్‌ బాగుంటే పూర్తి స్థాయిలో ఎక్స్‌ఛేంజ్‌ వర్తిస్తుంది. అలాగే వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అమెజాన్‌తో పాటు, వన్‌ప్లస్‌ స్టోర్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే నార్డ్‌ బడ్స్ 2ఆర్‌ను ఉచితంగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఇయర్‌ బడ్స్‌ ధర రూ. 2199గా ఉంది.

ఫోన్‌ కొనుగోలు చేస్తే ఉచితంగా పొందొచ్చు. ఈ ఇయర్‌ బడ్స్ విషయానికొస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఈ బడ్స్‌ ఏకంగా 40 గంటలపాటు పనిచేయడం విశేషం. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6,74 ఇంచెస్‌తో కూడిన అమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పనిచేసే డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే 80 వాట్స్‌ సూపర్ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఏంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.