ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన నోకియా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది.. అందులో భాగంగానే తాజాగా నోకియా జీ42 పేరుతో 5జీ ఫోన్ ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది.
మరి ఈ ఫోన్ కి సంబందించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. కాగా నోకియా జీ 42 5జీ ఫోన్ అసలు ధర రూ. 12,999 కాగా అమెజాన్ లో 23 శాతం డిస్కౌంట్ తో రూ.9,999 కి సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ పే బ్యాలెన్స్ తో పే చేసే వారికి రూ. 300 క్యాష్ బాక్ కూడా లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ను మీ పాత ఫోన్ తో ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఏకంగా రూ. 9,450 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.5 ఇంచెస్ తో కూడిన డిస్‌ప్లేను అందించారు. స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 50000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. కాగా ఫోన్ లో ఇందులో లిథియం పాలిమార్ బ్యాటరీని అందించారు. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ, 3.5 ఎమ్‌ఎమ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల టాక్ టైమ్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఫోన్ బరువు 194 గ్రాములుగా ఉంటుంది. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ ఏఐ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్, 2 ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్, ఏడాది మ్యాని ఫ్యాక్చరింగ్ వారంటీ అందిస్తున్నారు.