OnePlus: అద్భుతమైన ఫీచర్లతో వన్ ప్లస్ 20టీ.. లాంచ్ ఎప్పుడంటే?

మార్కెట్లో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్లు, అద్భుతమైన ఫీచర్ లతో అందుబాటులో ఉన్నప్పటికీ

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 01:00 PM IST

మార్కెట్లో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్లు, అద్భుతమైన ఫీచర్ లతో అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారులు మాత్రమే ఇంకా కొత్త కొత్త మొబైల్ ఫోన్ ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే చాలామంది ఫోన్ లవర్స్ మార్కెట్లోకి కొత్త ఫోన్ లాంచ్ అయింది అంటే చాలు వెంటనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా వినియోగదారులు ఒక్కొక్క సంస్థ మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇకపోతే వన్ ప్లస్ మొబైల్ లవర్స్ కి ఒక గుడ్ న్యూస్. వన్ ప్లస్ సంస్థ త్వరలోనే మార్కెట్లోకి వన్ ప్లస్ 10టీ 5జీ తీసుకురానున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా లాంచ్ తేదీని ప్రకటించింది.

ఈ వన్ ప్లస్ 10టీ 5జీ మొబైల్ ను ఆగస్టు 3వ తేదీన న్యూయార్క్ నగరంలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టు 3 నుంచి భారతదేశంలో ప్రీ ఆర్డర్ కోసం ఈ స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వెల్లడించింది వన్ ప్లస్ సంస్థ. ఈ ఫోన్‌కి సంబంధించి తాజాగా విడుదలైన ఫొటోని బట్టి చూస్తే ఈ మొబైల్‌ బ్యాక్ ప్యానెల్ టెక్స్చర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.అలాగే 360 డిగ్రీ యాంటినా సిస్టమ్‌ను ఆ కంపెనీ హైలైట్ చేస్తోంది. ఈవెంట్‌లో వన్‌ప్లస్ సరికొత్త ఆక్సిజన్‌ ఓఎస్ 13ని కూడా ఆవిష్కరించనుంది.

నివేదిక ప్రకారం వన్ ప్లస్ 10టీ 5జీ ధర CNY3,000 చైనా యువాన్లు కాగా భారత కరెన్సీ ప్రకారం రూ. 35,500, CNY 4,000 భారత కరెన్సీ ప్రకారం రూ. 47,400 మధ్య ఉండవచ్చని అంచనా. మరొక నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర భారత్ లో రూ. 49,999 ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే..8+ Gen 1 SoC ఫీచర్‌తో రానుంది.హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ అలాగే పూర్తి హెడ్ + రిజల్యూషన్‌తో 6.7అంగుళాల AMOLED డిస్ ప్లే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2మెగాపిక్సెల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌.50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 4,800mAh బ్యాటరీ సపోర్ట్‌16GB LPDDR5 RAMతో పాటు 512జీబీ. అలాగే కలర్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ బ్లాక్,గ్రీన్ కలర్లలో అందుబాటులో ఉంది.