Site icon HashtagU Telugu

iQOO Z9 5G: రూ. 25 వేల ఫోన్‌ కేవలం రూ. 17 వేలకే.. ఐకూ ఫోన్ పై భారీగా డిస్కౌంట్?

Mixcollage 08 Jul 2024 11 13 Am 9816

Mixcollage 08 Jul 2024 11 13 Am 9816

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ అయిన ఐకూ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఆయా ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే తాజాగా కూడా ఐకూ తన స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ధరను ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఐకూ జెడ్‌9 5జీ స్మార్ట్‌ ఫోన్8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర రూ. 24,999 కాగా ఇది ప్రస్తుతం అమెజాన్‌లో 20 శాతం డిస్కౌంట్‌ తో రూ. 19,999 కే లభిస్తోంది.

అంటే ఈ ఫోన్ పై ఏకంగా 5000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదండోయ్ ఇక పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 3 వేల వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ కూడా లభిస్తోంది. మీ పాత ఫోన్‌పై గరిష్టంగా రూ. 18,950 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కాగా ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 7200 డైమెన్సిటీ 5జీ ప్రాసెసర్‌ ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ లో 3.67 ఇంచెస్‌ తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిసప్లేను అందించారు.

120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌ ను ఇచ్చారు. 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం అని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్‌ లో 44 వాట్స్‌ ఫ్లాష్‌ ఛార్జ్‌కి సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని కూడా అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌, ఐపీ54 రేటింగ్‌ తో వాటర్‌ రెసిస్టెంట్‌ ను అందించారు. హెచ్‌డీఆర్‌ ప్లే బ్యాక్‌ సపోర్ట్‌ తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ లో 50 మెగాపిక్సెల్స్‌ తో కూడిన సోనీ ఐమ్యాక్స్‌ 882 ఓఐఎస్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. 4కే వీడియో రికార్డింగ్‌ చేసుకోవచ్చు. అలాగే కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో బ్లూటూత్‌ 5.3, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లను అందించారు.

Exit mobile version