Site icon HashtagU Telugu

Samsung Galaxy M05: కేవలం రూ.6 వేలకే శాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Samsung Galaxy M05

Samsung Galaxy M05

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ సేల్‌ లో భాగంగా చాలా రకాల ప్రాడక్టులపై అద్భుతమైన ఆఫర్లను డిస్కౌంట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇండియన్ సేల్ మొదలయ్యి చాలా రోజులు అయింది. ఈ ఆఫర్ మరికొద్ది రోజులు కొనసాగ ఉంది. అయితే తక్కువ బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ వంటివి కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఈ సేల్‌ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహో పకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే శాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌05 ఫోన్‌పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్ లభిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గెలాక్సి ఎమ్‌05 స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999 గా ఉంది. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ ను కేవలం రూ. 6499 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ను అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 194 క్యాష్‌ బ్యాక్‌ సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ ను రూ.6వేలకే సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా అదనంగా రూ. 6150 వరకు డిస్కౌంట్ పొందవచ్చట. మీ పాత ఫోన్‌ కు కనీసం రూ. 3 వేలు డిస్కౌంట్ లభించినా ఈ ఫోన్‌ ను రూ. 3 వేలకే సొంతం చేసుకోవచ్చట.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌05 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ను అందించారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ ను కూడా ఇచ్చారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌ అప్‌గ్రేడ్‌, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు. ఇకపోతే కనెక్టివిటీ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లు అందించారు. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ ను కూడా అందించారు.