Site icon HashtagU Telugu

Realme Narzo 70 Pro:రూ. 27 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 18 వేలకే.. అదెలా అంటే?

Realme Narzo 70 Pro

Realme Narzo 70 Pro

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల కాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగానే ఇప్పటికే చాలా రకాల స్మాల్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందించిన అమెజాన్ ఇప్పుడు గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ లో బాగా రియల్ మీ ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇంతకీ ఆ డీల్ ఏంటి? ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ని అందిస్తోంది అన్న వివరాల్లోకి వెళితే.. రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్ పై డిస్కౌంట్ ని అందిస్తోంది అమెజాన్.

కాగా ఈ రియల్ మీ నార్జో 70ప్రో 5జీ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ అసలు ధర రూ. 26,999 కాగా ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ లో భాగంగా 30 శాతం డిస్కౌంట్‌ తో తక్కువ ధరకే అందిస్తోంది. ఇక అమ్మాయి శాతం డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని కేవలం రూ. 18,998కే సొంతం చేసుకోవచ్చు. అయితే దీంతో పాటు అమెజాన్‌ పే బ్యాక్‌ బ్యాలెన్స్‌తో పే చేస్తే అదనంగా మరో రూ. 570 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్‌ ను అన్ని డిస్కౌంట్స్‌ తో కలిపి రూ. 18,500కే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ లో 50 మెగా పిక్సెల్స్‌ లో కూడిన సోనీ ఐమ్యాక్స్‌890 నైట్ విజన్‌ కెమెరాను అందించారు.

మెయిన్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీతో కూడిన మరో రెండు కెమెరాలను కూడా అందించారు ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన 120 హెచ్‌జెడ్‌ అమోఎల్‌ఈడీ ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ ను ఇచ్చారు. 2412 x 1080 పిక్సెల్స్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో ఎయిర్ గెశ్చర్‌ అనే ఫీచర్‌ ను ఇచ్చారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 67 వాట్స్‌ ఫ్లాష్‌చేంజ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ కేవలం 11 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ చెబుతోంది.