అమెజాన్ సంస్థ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రకటించింది. ఇండియాలో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 28 నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సేల్ లో భాగంగా చాలా రకాల వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. అందులో ఒక భాగంగానే స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది అమెజాన్ సంస్థ. బ్యూటీ ప్రొడక్టులతో పాటు ఇ కామర్స్ ప్లాట్ ఫారమ్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లతో చేసిన లావాదేవీలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ లను పొందవచ్చు.
అనేక ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ డిసెంబర్ 2న ముగుస్తుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీలో అత్యంత ముఖ్యమైన డీల్స్ లో ఒకటి. కాగా ఈ హ్యాండ్‌సెట్ అసలు ధర రూ. 1,24,999 కాగా ఆఫర్ లో భాగంగా రూ. 74,999 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇ కామర్స్ దిగ్గజం ఆపిల్, ఐక్యూ, వన్‌ప్లస్, రియల్‌మి, రెడ్‌మి, టెక్నో వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ లపై 40 శాతం వరకు తగ్గింపుతో ఆఫర్ లను అందించింది.
మాత్రమే కాకుండా లాప్టాప్ లు టీవీలు అలాగే గృహపకరణాలు ఇంకా చాలా రకాల వాటిపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. కాబట్టి వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు.