Site icon HashtagU Telugu

Alexa : చనిపోయిన వారి గొంతు వినిపించే ఫీచర్.. అమెజాన్ అలెక్సా ముందడుగు!

Alexaa

Alexaa

అమెజాన్ అలెక్సా మరింత స్మార్ట్ గా తయారవుతోంది. త్వరలోనే ఓ కొత్త ఫీచర్ ను అది తీసుకొస్తోందట. అదేమిటంటే.. చనిపోయిన బంధువులు, స్నేహితులతోనూ మాట్లాడే వెసులుబాటు!! ఇటీవల ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈవిషయాన్ని అమెజాన్ అలెక్సా ప్రకటించింది. ఒక వ్యక్తి గొంతును విన్న కొన్ని సెకన్ల తర్వాత అచ్చం అలాగే హై క్వాలిటీలో మాట్లాడగలిగేలా అలెక్సా అల్గారితం ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది సాధ్యం అయిందని పేర్కొంది. మనకు దూరం అయిన మనవాళ్ల గొంతును వినే అరుదైన అవకాశం దీని ద్వారా లభిస్తుందని తెలిపింది. రాబోయే కొత్త ఫీచర్ కు సంబంధించిన డెమో వీడియోను కూడా ఆ కాన్ఫరెన్స్ సందర్భంగా అమెజాన్ అలెక్సా ప్రదర్శించింది. దీన్ని ట్విటర్ లో షేర్ చేయగా.. నెటిజన్స్ నుంచి విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. “ఇలాంటి ఫీచర్ వస్తుందని తెలియక .. కొన్ని రోజుల క్రితమే మా నాన్న వాయిస్ రికార్డులు డిలీట్ చేశాను. ఆయన కొన్ని నెలల క్రితమే చనిపోయారు” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

Exit mobile version