Apple Watch: యాపిల్ స్మార్ట్ వాచ్ తో ప్రెగ్నెన్సీ టెస్ట్..ఎలా అంటే?

రోజురోజుకి టెక్నాలజీ మరింత డెవలప్ అవుతుంది. దీనితో అన్ని రంగాలలో కూడా టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు

  • Written By:
  • Publish Date - October 10, 2022 / 06:40 PM IST

రోజురోజుకి టెక్నాలజీ మరింత డెవలప్ అవుతుంది. దీనితో అన్ని రంగాలలో కూడా టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే టెక్నాలజీ డెవలప్ అయింది అనడానికి ఎన్నో ఒక రకాల ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఉదాహరణగా స్మార్ట్ వాచ్ ను చెప్పవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ లలో రకరకాల ఫీచర్స్ ని జోడించి వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో రోజురోజుకీ మార్కెట్లో స్మార్ట్ వాచ్ లకు ఉన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. దీంతో స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీలు సరికొత్త విధానాలు, ఫీచర్ లతో స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన స్మార్ట్ వాచ్ ల ద్వారా బీపీ చెక్ చేసుకోవడం, స్లీపింగ్ మోడ్, పల్స్ రేట్, అలాగే స్టెప్ కౌంటింగ్ లాంటి ఫీచర్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే

ఈ విధంగా స్మార్ట్ వాచ్ లలో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉండడంతో ప్రతి ఒక్కరూ వీటిపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్ కంపెనీ శరీరంలో జరిగే మార్పులను సైతం గుర్తించే విధంగా తయారు చేస్తోంది. అంతే కాకుండా ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ద్వారా మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ ని కూడా చేసుకోవచ్చట. మహిళలు గర్భం దాల్చితే ఈ విషయాన్ని కూడా ఈ స్మార్ట్‌ వాచ్‌ గుర్తిస్తోందట. తాను గర్భం దాల్చినట్లు తెలుసుకోకముందు ఆపిల్‌ వాచ్‌ గుర్తించిందని సదరు మహిళ పేర్కొంది. 34 సంవత్సరాలున్న మహిళ తన ఆపిల్‌ వాచ్‌ కొన్ని రోజుల వ్యవధిలో తన హృదయ స్పందన రేటులో గణనీయమైన పెరుగుదలను సూచించినట్లు గమనించింది.

కాగా సాధారణంగా విశ్రాంతి హృదయ స్పందన రేటు 57 నుంచి 72కి పెరిగిందని ఆ విధంగా స్పందన రేటు గణనీయంగా పెరగడంతో సదరు మహిళకు అనుమానం వచ్చి చెక్ చేయించుకోగా తాను గర్భం దాల్చిన మొదటి వారాలలో వేగవంతమైన హృదయ స్పందన రేటును గమనించానని ఆమె వెల్లడించింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కోసం ఆస్పత్రికి వెళ్లగా, నాలుగు వారాల గర్భవతి అని నిర్ధారణ అయినట్లు తెలిపింది తెలిసిందట. ఇలా నాకు తెలియకుండానే గర్భం దాల్చినట్లు వాచ్‌ తెలిపిందని ఆమె వెల్లడించింది. అయినప్పటికీ ఆపిల్‌ వాచ్‌కు గర్బాన్ని గుర్తించాడనికి అధికారిక ఫీచర్‌ లేదు. ఇది సగటు హృదయ స్పందన రేటులో మార్పు ద్వారా శరీరంలో జరుగుతున్న అసాధారణ విసయాలను గుర్తించగలదు. ఇందులో ఐఓఎస్‌16 అప్డేట్‌తో ఆపిల్‌ వాచ్‌ మహిళల కోసం ఒక ముఖ్యమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది.