Apps Alert : దడ పుట్టిస్తున్న ‘డర్టీ స్ట్రీమ్’.. ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్

Apps Alert : ‘డర్టీ స్ట్రీమ్’ మాల్వేర్ దడ పుట్టిస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - May 7, 2024 / 05:41 PM IST

Apps Alert : ‘డర్టీ స్ట్రీమ్’ మాల్వేర్ దడ పుట్టిస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. ఆయా ఫోన్లలోని మొత్తం సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. దీనిపై తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ సెక్యూరిటీ టీమ్  ఆండ్రాయిడ్ యూజర్లను అలర్ట్ చేసింది. రెడ్ బెల్ మోగించింది. ఇంతకీ ఏమిటీ ‘డర్టీ స్ట్రీమ్’ మాల్వేర్ ? ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను ఎలా టార్గెట్ చేసుకుంటోంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • డర్టీ స్ట్రీమ్ అనేది ఒక ప్రమాదకర మాల్‌వేర్. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్స్(Apps Alert) ద్వారా కూడా మన ఫోన్‌లోకి చొరబడుతుంది.
  • డర్టీ స్ట్రీమ్ మాల్‌వేర్.. మన ఆండ్రాయిడ్​ ఫోనులోని కంటెంట్​ ప్రొవైడర్​ సిస్టమ్‌పై దాడి చేసే రిస్క్ ఉంటుంది. అది దాడి చేశాక, ఫోన్  దాని కంట్రోల్​లోకి వెళ్లిపోతుంది.
  • డర్టీ స్ట్రీమ్ ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యాక.. అందులోని ఫైల్స్ అన్నీ రహస్య సర్వర్లకు ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి.
  • మన ఫోన్‌లోని యాప్‌లను హ్యాకర్లు హైజాక్ చేసి.. వాటి నుంచి ఇష్టం వచ్చిన వారికి మెసేజ్‌లను పంపిస్తారు.
  • యూజర్ల ప్రైవసీకి, భద్రతకు ముప్పు కలిగించే తరహాలో ప్రమాదకర యాక్టివిటీని హ్యాకర్లు నిర్వహించేలా ఈ మాల్ వేర్ మార్గాన్ని సుగమం చేస్తుంది.
  • ప్రత్యేకించి గూగుల్ ప్లేస్టోర్​లోని కొన్ని యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లిస్టులో షావోమీ ఫైల్ మేనేజర్​ యాప్ ఉంది. దీనికి 1 బిలియన్ డౌన్​లోడ్స్ ఉన్నాయి. డబ్ల్యూపీఎస్​ (WPS) ఆఫీస్ యాప్‌కు 500 మిలియన్ డౌన్​లోడ్స్​ ఉన్నాయి. వాస్తవానికి ఈ యాప్​ల కోసం సెక్యూరిటీ ప్యాచ్​లను ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే అవి ఎంతమేరకు మన డివైజ్‌కు ప్రొటెక్షన్ ఇస్తాయనేది గ్యారంటీగా చెప్పలేం. ఈ యాప్‌లను వాడకుండా ఉంటే బెటర్.

Also Read : MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఈనెల 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ

  • సైబర్ దాడుల నుంచి రక్షణ పొందాలంటే థర్డ్-పార్టీ యాప్​లను వాడకూడదు.
  • కచ్చితంగా గూగుల్ ప్లే ప్రొటెక్ట్​ను ఎనేబుల్ చేసుకోవాలి.
  • మీ ఆండ్రాయిడ్ ఫోనులో ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్స్​ సైడ్ లోడింగ్ కాకుండా చూసుకోండి. సైడ్​ లోడింగ్ యాప్స్​ వల్ల ప్రమాదకరమైన వైరస్​లు ఫోనులోకి చొరబడతాయి.

Also Read :Family Star: ఓటీటీలో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్

Follow us