Aadhaar: మరో రెండు రోజుల్లో ముగినున్న ఆధార్ ఫ్రీ సర్వీస్ సేవలు.. చివరి తేదీ ఎప్పుడంటే?

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు సంబంధించి అన్నింటికి కోసం ఈ ఆధార్ కా

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 10:00 PM IST

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు సంబంధించి అన్నింటికి కోసం ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. అయితే ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే. అతి ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఆధార్ ఒకటి. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడానికి ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. మరీ అలాంటి ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉంటే చిక్కుల్లో పడ్డట్టే. ఒకవేళ వాటిని మీరు గుర్తించినట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవాలి.

ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వెంటనే వాటిని సరి చేసుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆధార్ అప్‌డేట్ చేసే సర్వీస్‌ ప్రస్తుతానికి ఫ్రీగా అందిస్తోంది. అయితే ఈ ఫ్రీ సర్వీస్ డెడ్ లైన్ దగ్గరపడింది. ఇప్పటికే పలుసార్లు ఆధార్ కార్డు అప్ డేట్ ఫ్రీ సర్వీస్ డెడ్ లైన్ వాయిదా వేస్తూ వచ్చింది UIDAI . అయితే చివరిసారిగా ఇచ్చిన డెడ్ లైన్ మరో రెండు రోజుల్లోనే ముగుస్తోంది. ఆధార్ కార్డులో పేరులో మార్పు, చిరునామా, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ లాంటి వివరాలు మార్చుకోవడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 14 గా ఉంది. అంటే మరో 2 రోజుల్లోనే ఈ సర్వీస్ క్లోజ్ కానుందన్నమాట. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ సారి ఈ డేట్ పొడగించేది లేదని తెలుస్తోంది. https://myaadhaar.uidai.gov.in విజిట్ చేసి మీ ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవచ్చు.

ఇందులో మొదట మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత ఆన్లైన్ అప్డేట్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పైన క్లిక్ చేసి ప్రొసీడింగ్స్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. పేమెంట్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తి చేయాలి. అప్పుడు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. యూఆర్ఎన్ నెంబర్‌తో మీ ఆధార్ అప్‍‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కాగా ఆధార్ కార్డు వివరాలను ఎన్నిసార్లు అప్‌డేట్ చేయొచ్చన్న విషయాన్ని చెబుతూ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని పరిమితులు, షరతులను పెట్టింది.

ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎక్కువ సార్లు మార్చుకోవడానికి వీలు లేదు. ఆధార్‌ కార్డ్ హోల్డర్‌ తన జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు సమస్యల పరిష్కారం కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది. UIDAI ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ తీసుకొచ్చింది. ఈ హెల్ప్ లైన్ నంబర్ 1947. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. ఈ నంబర్‌కు కాల్ చేసి మీ అనుమానాలు అన్నీ 1947 నంబర్‌కు కాల్ చేస్తే UIDAI ప్రతినిధులు మీతో మాట్లాడుతారు.