Site icon HashtagU Telugu

AI : 140 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్..?

Ai Effect

Ai Effect

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతూ, అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపుతోంది. యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీడీఏడీ) తాజా నివేదిక ప్రకారం.. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల (40 శాతం) ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశముంది. ఇది ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన శ్రమపై ఆధారపడిన దేశాలకు గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. ఈ ప్రభావం అన్ని దేశాలకు సమానంగా ఉండకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత వెనుకబడే అవకాశం ఉంది.

BREAKING: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోదం!

ఏఐ అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా సమానంగా విస్తరించకపోవడం వల్ల కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, కంపెనీలు మాత్రమే అధిక లాభాలను పొందే ప్రమాదం ఉంది. అమెరికా, చైనా వంటి దేశాలు ఇప్పటికే ఏఐ రంగంలో ముందుండి దూసుకెళ్తున్నాయి. ప్రపంచ ఎయి ఆర్ అండ్ డీ వ్యయంలో 40 శాతం కేవలం 100 సంస్థల అధిపత్యంలో ఉండటం ఈ కేంద్రీకరణను సూచిస్తోంది. ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే కొన్ని దేశాల సంపదకన్నా ఎక్కువ మార్కెట్ విలువ కలిగి ఉండటం గమనార్హం.

PBKS vs RR: మైదానంలో లైవ్ మ్యాచ్ జరుగుతోంది.. హాయిగా నిద్ర‌పోయిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైర‌ల్

ఏఐ ఆధారిత ఆటోమేషన్ వ్యవస్థలు శ్రమ కంటే మూలధనానికి ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఈ పరిణామం అభివృద్ధి చెందుతున్న దేశాల పోటీతత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఆదాయ అసమానతను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఉద్యోగాల హరించే ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశముండటంతో, అన్ని దేశాలు సమానంగా ఏఐ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్నది ఈ నివేదిక సూచన.

Exit mobile version