5G: జియోకు భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. నెలలోపే 5జీ సేవలు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న కంపెనీ సిమ్ లు ఒకటి జియో కాగా మరొకటి ఎయిర్టెల్.

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 09:17 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న కంపెనీ సిమ్ లు ఒకటి జియో కాగా మరొకటి ఎయిర్టెల్. దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఈ రెండు కంపెనీ సిమ్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి పదిమందిలో నలుగురు ఎయిర్టెల్ ని ఉపయోగిస్తే, మిగిలిన 6 మంది జియోని ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ రెండు టెలికాం కంపెనీలో పోటా పోటీగా దూసుకుపోతూ వినియోగదారుల కోసం అద్భుతమైన సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొని రావడానికి గట్టిగానే కృషి చేస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఎయిర్టెల్ టెలికాం సంస్థ జియో కి భారీగా షాక్ ఇచ్చింది. అదేమిటంటే భారత్ లో ఎయిర్‌టెల్‌ నెల రోజుల్లోగా 5జీ సేవలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించింది. కాగా డిసెంబర్‌ నాటికి ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సర్వీసులను పూర్తిగా పరిచయం చేస్తామని ఎయిర్టెల్ సంస్థ సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు. ఈ ఏడాది దీపావళి కి రిలయన్స్‌ జియో 5జీ సేవలను లాంచ్‌ చేయనున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ మరింత వేగాన్ని పెంచేసింది. దేశంలో వీలైనంత త్వరగా ఎయిర్టెల్ 5జీ సేవలను లాంచ్‌ చేయనుంది. ఈ వార్తలతో ఇంట్రాడే ట్రేడ్‌లో ఎయిర్‌టెల్‌ షేర్ రెండు శాతానికి పైగా లాభపడి రూ.770 స్థాయికి చేరుకుంది.

అయితే 2023 లోపు దేశవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాలను కవర్‌ చేస్తామనీ తెలిపారు ఎయిర్టెల్ సంస్థ వారు. 4జీతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ 5జీ వేగం 20-30 రెట్లు అధికంగా ఉంటుందనీ చెప్పుకొచ్చారు. అయితే ఏ ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నది వినియోగదార్లు ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని వారు వెళ్ళిడించారు.