Site icon HashtagU Telugu

AirTel: యూజర్లకు ఎయిర్ టెల్ తీపికబురు…!!

5g Network India

5g Network India

దేశంలో ఇప్పుడంతా 5జీ హల్ చల్ చేస్తోంది. రిలయన్స్ వర్సెస్ భారతీ ఎయిర్ మధ్య తగ్గాఫర్ పోటీ నెలకొంది. స్పేస్ ద్వారా నెట్ కనెక్టివిటీ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాయి ఈ రెండు కంపెనీలు. అంతేకాదు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కూడా స్పెస్ ఎక్స్ ను నిర్వహిస్తున్నారు. అయితే తమకు బిజినెస్ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని సదరు కంపెనీ భారత ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకుంది. దీంతో 5జీ సర్వీసెస్ విషయంలో మరింత పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో…యూజర్లు మాత్రం మంచి సర్వీసులను పొందే అవకాశం ఉంది.

ఇప్పుడు లేటెస్టుగా టెలికాం రంగానికి చెందిన భారతీ ఎయిర్ టెల్ ఓ కీలక ప్రకటన చేసింది. రియలన్స్ జియో పలు నగరాల్లో 5జీ సర్వీసు అందిస్తుండగా…జియోకు పోటీగా ఎయిర్ టెల్ కూడా దూసుకుపోతుంది. దేశంలో 8 నగరాల్లో తన 5జీ సర్వీసులను అందిస్తోంది ఎయిర్ టెల్. తాజాగా పానిపట్ లో 5జీ సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్, మద్రాస్, ముంబై, బెంగళూరు, సిలిగురి, నాగ్ పూర్, వారణాసి, తోపాటు పలు నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది సదరు కంపెనీ. ఇక 5జీ సర్వీసును పొందాలంటూ యూజర్లకు కొత్త సిమ్ ను వాడాల్సిన పనిలేదని ఎయిర్ టెల్ స్పష్టం చేసింది.