Meta AI Assistant : వాట్సాప్​, ఇన్​స్టా‌లలో ఏఐ అసిస్టెంట్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

Meta AI Assistant : వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​‌ల పేరెంట్ ఆర్గనైజేషన్ ‘మెటా’ ఈ మూడు యాప్‌లలో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 

Published By: HashtagU Telugu Desk
Meta Ai Assistant

Meta Ai Assistant

Meta AI Assistant : వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​‌ల పేరెంట్ ఆర్గనైజేషన్ ‘మెటా’ ఈ మూడు యాప్‌లలో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.  దానిపై మెటా ‘ఏఐ అసిస్టెంట్’ !!  అచ్చం ఛాట్‌ జీపీటీ‌లాగే ఇది కూడా ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం ఇచ్చేస్తుంది. రియల్‌టైమ్‌ ఇమేజ్​లను, యానిమేషన్స్​ను రూపొందించి ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకే అందుబాటులో ఉంది.

We’re now on WhatsApp. Click to Join

మన దేశంలోనూ కొందరు యూజర్లకు ఈ నయా ఏఐ ఫీచర్‌ దర్శనమిస్తోంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. వాట్సప్‌ ఛాట్‌ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో మెటా ఏఐ ఐకాన్‌ కనిపిస్తోంది. దీనిపై క్లిక్‌ చేస్తే ‘ఆస్క్‌ మెటా ఏఐ ఎనీథింగ్‌’ అంటూ ఓ పాప్‌ అప్‌ ఓపెన్‌ అవుతుంది. కంటిన్యూపై క్లిక్‌ చేస్తే, మెటా ఏఐతో చాట్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. ఈ  ఛాట్‌ మెనూలో మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఏఐ సమాధానం ఇస్తుంది.

Also Read : Chandrababu Birthday : చంద్రబాబు బర్త్‌డే.. విద్యార్థి నేత నుంచి సీఎం దాకా స్ఫూర్తిదాయక ప్రస్థానం

ఏఐ అసిస్టెంట్ ఇలా పనిచేస్తుంది..

  • మెటా ఏఐ అసిస్టెంట్(Meta AI Assistant)​ లాలామా 3 లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా పని చేస్తుంది.
  • మనం టెక్ట్స్‌ రూపంలో కమాండ్ ఇవ్వగానే మెటా ఏఐ ఇమేజ్‌ జనరేట్‌ చేస్తుంది.
  • ఈ ఇమేజ్‌తో మనం క్వాలిటీ మిస్‌ కాకుండా ఫొటోలను యానిమేట్‌ చేసుకోవచ్చు.
  • వెబ్‌లో కూడా meta.ai సేవలను మనం వాడుకోవచ్చు.
  • మనం ఊహించుకున్న చిత్రాన్ని టెక్ట్స్‌ రూపంలో ఏఐ అసిస్టెంట్‌కు చెబితే .. దాని  ఇమేజ్‌ను జనరేట్‌  చేస్తుంది.
  • ఫొటోను GIFగా మార్చే ఫీచర్‌ కూడా ఇందులో ఉంది.
  • వాట్సాప్‌లో ‘వాయిస్​ నోట్ ట్రాన్స్​క్రిప్షన్’  అనే మరో ఫీచర్ కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీనితో వాయిస్​ మెసేజ్​లను టెక్ట్స్​ రూపంలోకి మార్చుకోవచ్చు.

Also Read : Nandamuri Balakrishna : నేను టీడీపీ వైపే ఉన్నాను.. వైసీపీ వైపు కాదు.. తారకరత్న భార్య పోస్టు..

  Last Updated: 20 Apr 2024, 12:49 PM IST